పవన్: భయంతో అన్నయ్యకు పిలుపు..!

Divya
ఆంధ్రప్రదేశ్ ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిని గద్దె దించుతానంటూ ఎన్నో ప్రగాల్బాలు పలికిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఓటమి భయం పట్టుకున్నట్టుగా కనిపిస్తోంది. పిఠాపురంలో పోటీ చేస్తున్న పవన్ కళ్యాణ్..అక్కడ స్థానికంగా ఉండే టిడిపి నేత వర్మ చివరి వరకు తనతో సరిగ్గా ఉంటారా లేదా అనే విషయం పైన కూడా పవన్ కళ్యాణ్ ఆందోళన పడుతున్నట్లుగా సమాచారం. ముఖ్యంగా వర్మ సీటును అప్పనంగా దొబ్బేసిన పవన్ ను గెలిపించి మోయాల్సిన అవసరము వర్మకు ఏమీ లేదని అందుకే చివరిలో కాడే వదిలేస్తాడని భయం పవన్ లో మొదలైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ వర్మ హ్యాండ్ ఇస్తే ఖచ్చితంగా గతంలో జరిగిన గాజువాక ,భీమవరం ఫలితాలు ఈసారి మళ్లీ రిపీట్ అవుతాయని భయం పవన్ లో చుట్టుకుంది.

మరొకవైపు వైసీపీ అభ్యర్థి అయినటువంటి వంగా గీతాకు కూడా ప్రజా ఆదరణ బాగానే ఉన్నది. ఈమె స్థానికరాలు ప్రజలకు అందుబాటులో ఉంటుంది నోటిఫికేషన్ రాకముందే పలు రకాల నియోజకవర్గాలను చుట్టేస్తోంది.. పవనేమో ఒకరోజు పర్యటన చేస్తే రెండు రోజులు జ్వరంతో హైదరాబాద్కు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ ఉంటారని గ్యారెంటీ కూడా లేదు. దీంతో తను గెలవడానికి తన సత్తా ఒకటే సరిపోదని తన అన్నయ్య చిరంజీవి పాపులారిటీ కూడా ఉపయోగించుకోవాలని చూస్తున్నారట.

అందుకే తన అన్నయ్యని ప్రచారానికి పిలిపించే విధంగా పవన్ కళ్యాణ్ ప్లాన్ చేస్తున్నారు.తాను రాజకీయాలకు దూరంగా ఉన్నప్పటికీ ఎలాంటి రాజకీయ ప్రకటనలు చేయనని గతంలో కూడా చిరంజీవి తెలియజేశారు. అయితే ఈ మధ్యనే మాట మార్చి పంచకర్ల రమేష్ ,సీఎం రమేష్ లను పక్కన కూర్చోబెట్టుకొని కూటమిని గెలిపించాలంటూ మళ్ళీ పిలుపునివ్వడంతో మే 5వ తేదీన చిరంజీవి పిఠాపురంలో ప్రచారం చేయబోతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే చిరంజీవి ప్రధాన సభలు రోడ్డు షోలలో కూడా చిరంజీవి పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: