హోం మంత్రి వ‌నిత‌కు స్ట్రాంగ్‌గా స‌వాల్ విసిరిన ' టీడీపీ మ‌ద్దిపాటి '

RAMAKRISHNA S.S.
- జూనియ‌ర్‌పై గెలిచేందుకు ఆప‌సోపాలు ప‌డుతోన్న హోం మంత్రి
- వ‌ర్గాలు ఏకం కావ‌డంతో గోపాల‌పురం టీడీపీలో ఫుల్ జోష్‌
- నామినేష‌న్ల‌కు ముందే వైసీపీ కేడ‌ర్ డ‌ల్‌... ఫుల్ స్వింగ్‌లో ప‌సుపు పార్టీ
( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ )
అటు అధికారపక్షం నుంచి హోంమంత్రి పోటీలో ఉన్నారు.. ఇటు చూస్తే రాజకీయంగా జూనియర్ నేత పోటీలో ఉన్నారు. ఇప్పటివరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం లేదు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీలో ఉన్నారు.. ఆర్థికంగాను హోంమంత్రికి సరితూగలేని పరిస్థితి అయినా కూడా అక్కడ పోరు చూస్తుంటే హోం మంత్రిపై ఆ జూనియర్ గెలిచేస్తాడు అన్న వాతావరణం ఎన్నికలకు 20 రోజుల ముందే కనిపిస్తోంది. అదే తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం నియోజకవర్గం. వైసీపీ నుంచి హోం మంత్రి తానేటి వనిత.. టిడిపి నుంచి ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్యపాటి వెంకటరాజు పోటీ చేస్తున్నారు. ఇద్దరి మధ్య సరిపోల్చి చూస్తే అనుభవంలోనూ, ఆస్తిలోనూ వనితకు వెంకటరాజు ఏమాత్రం సరితూగే పరిస్థితి లేదు. వనితకు వెంకట్ రాజుతో పోలిస్తే ఎంత అనుభ‌వం ఉన్నా కూడా వెంకట్రాజును ఢీ కొట్టేందుకు ఆమె ఆపసోపాలు పడుతున్న పరిస్థితి.

వెంక‌ట్రాజుకు చంద్ర‌బాబు రెండేళ్ల క్రిత‌మే ఇన్‌చార్జ్ ప‌గ్గాలు అప్ప‌గించారు. అప్ప‌టి నుంచే ప్ర‌తి రోజు జ‌నాల్లో ఉంటూ అధికార పార్టీ ప్ర‌జా వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌పై పోరాటం చేస్తూనే ఇటు పార్టీని నియోజ‌క‌వ‌ర్గంలో బ‌లోపేతం చేసుకుంటూ వ‌చ్చారు. టీడీపీ కంచుకోట‌లో గ‌త ఎన్నిక‌ల్లో పార్టీకి ఘోర అవ‌మాన‌మే మిగిలింది. ఏకంగా 37 వేల ఓట్ల తేడాతో పార్టీ ఓడిపోయింది. అలాంటి ప‌రిస్థితి నుంచి ఈ రోజు ఎన్నిక‌ల‌కు ముందే.. అటు వైపు హోం మంత్రి పోటీ చేస్తున్నా గెలుపు సైకిల్‌దే అనే కాడ‌కు తీసుకు వ‌చ్చాడంటే వెంక‌ట్రాజు ఏ స్థాయిలో క‌ష్ట‌ప‌డ్డాడో అర్థం చేసుకోవ‌చ్చు.

వెంక‌ట్రాజుకు పెరుగుతోన్న ప్ల‌స్‌లు.. వ‌నిత‌కు పెరుగుతోన్న మైన‌స్‌లు...
గోపాల‌పురం నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలో ఉన్న రెండు వ‌ర్గాలు ఇప్పుడు ఏక‌తాటిమీద‌కు వ‌చ్చేశాయి. స్వ‌యంగా పార్టీ అధినేత చంద్ర‌బాబు జోక్యం చేసుకోవ‌డంతో ఇప్పుడు అన్ని వ‌ర్గాలు, గ్రూపులో క‌సితో క‌లిసి ప‌ని చేస్తున్నాయి. మొన్న వెంక‌ట్రాజు నామినేష‌న్ ఒక రేంజ్‌లో దద్ద‌రిల్లింది. వెంక‌ట్రాజు నామినేష‌న్‌తోనే వైసీపీ వాళ్ల‌కు సీన్ అర్థ‌మైంది. దీంతో వ‌నిత నామినేష‌న్‌కు గ్రామాల వారీగా ముందే డ‌బ్బులు పంపి టార్గెట్లు పెట్టి మ‌రీ జ‌నాల‌ను తోలాల‌ని చేసిన ప్ర‌య‌త్నం విఫ‌ల‌మైంది. నామినేష‌న్‌తోనే వెంక‌ట్రాజు విసిరిన స‌వాల్ హోం మంత్రిని డైల‌మాలో ప‌డేసింద‌నే అంటున్నారు.

ఇటు వెంక‌ట్రాజు గెలుపుకోసం పార్టీలో వ‌ర్గాలు అన్నీ క‌లిసి క‌ట్టుగా ప‌ని చేస్తుంటే అదే టైంలో ఎప్పుడో 2009లో వ‌నిత‌ను ఇక్క‌డ గెలిపిస్తే 15 ఏళ్ల పాటు ఆమె ఇటు వైపు తొంగి చూడ‌లేదు. ఎమ్మెల్యేగా గెలిపిస్తే గోపాల‌పురం జ‌నాల ఆశ‌ల‌ను వ‌మ్ము చేసి కొవ్వూరుకు వెళ్లిపోయిన ఆమె ఇప్పుడు అక్క‌డ వ్య‌తిరేక‌త మూట‌క‌ట్టుకుని తిరిగి గోపాల‌పురంకు రావ‌డంతో ఇక్క‌డ ఈ సారి వ‌నిత‌పై తీవ్ర వ్య‌తిరేక‌త క‌నిపిస్తోంది. పైగా నియోజ‌క‌వ‌ర్గంలో పార్టీలో జ‌గ‌న్ ద‌గ్గ‌ర ప‌లుకుబ‌డి ఉన్న నేత‌ల‌ను కూడా ఆమె ప‌క్క‌న పెడుతోన్న ప‌రిస్థితి. ఏదేమైనా ఈ సారి గోపాల‌పురంలో అన్నింటిని వెంక‌ట్రాజు తొక్కుకుంటూ, అనుమానాలు ప‌టాపంచ‌లు చేస్తూ గెలుపు వైపు దూసుకుపోతోన్న వాతావ‌ర‌ణ‌మే ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: