లైఫ్ స్టైల్: పనసతొనల తో సంతాన భాగ్యం..!!

Divya
ఇటీవల కాలంలో చాలామంది లేటు వయసులో వివాహం చేసుకోవడం వల్ల పిల్లలకు జన్మనివ్వడానికి కూడా సమయం పడుతుంది . పిల్లలను కావాలనే ఎంతో మంది తల్లిదండ్రులు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే ఎటువంటి లోపం  లేకున్నా.. పిల్లలు కావడం లేదు ఒక్కసారి పరీక్షించుకోవాలి. పనస తొనల తో కూడా సంతాన భాగ్యం కలుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇకపోతే రుచిగల పనసపండు తినడానికే కాదు ఆరోగ్యానికి కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగిస్తుంది. ఇందులో ఉండే ఎన్నో పోషక విలువలు మనకు ఆరోగ్యం ఇవ్వడమే కాదు అందాన్ని కూడా పెంపొందిస్తాయి. అలాగే సంతాన భాగ్యాన్ని కూడా ప్రసాదిస్తాయి.
ఇకపోతే ఇతర ప్రాంతాలలో ఎలా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో పనసపండుకి ఫుల్ డిమాండ్ ఉందని చెప్పడంలో సందేహం లేదు. చెట్లకు సాధారణంగా పూలు నుంచి పిందె .. పిందె నుంచి కాయ.. పండుగా మారుతుంది. కానీ పనసపండు మాత్రం అలా జరగదు. కాండం  నుంచి దిగి అవి కాయలు, పండ్లుగా తయారవుతాయి. ముఖ్యంగా సువాసనలు కూడా వెదజల్లుతూ ఉంటాయి. ఇక నోరూరించే ఆరోగ్యమైన ప్రయోజనాలను అందించే పనస పండు అంటే ప్రతి ఒక్కరికీ ఇష్టమే. ఈ పండు అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు . చిన్న పిల్లల నుంచి పండు ముదుసలి వరకూ పనస పండు తినడం వల్ల అన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
పనస పండ్లలో మనకు లభించే విటమిన్  విషయానికి వస్తే విటమిన్ ఎ,  విటమిన్ సితో పాటు విటమిన్ బి 6 వంటి విటమిన్స్  కూడా పుష్కలంగా లభిస్థాయి. ఇక కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, సోడియం ,ఐరన్, జింక్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ముఖ్యంగా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేయడంతో పాటు మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను కలుగజేస్తాయి. రోగనిరోధక శక్తిగా ఉపయోగపడే ఈ పనస పండు తినడం వల్ల క్యాన్సర్ కు వ్యతిరేకంగా కూడా పోరాడతాయి. రంగు ప్రేగు క్యాన్సర్ లు కూడా రాకుండా కాపాడతాయి ముఖ్యంగా మలబద్ధకం సమస్యతో ఉన్న వారికి చక్కటి ఆహారం. విటమిన్ ఎ కంటి చూపును మెరుగు పరచడమే కాకుండా రక్తం పెంచి, జుట్టును, చర్మం  ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. మగవారిలో వీర్యకణాల శక్తిని, సంఖ్య ని పెంచి సంతానానికి సహాయపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: