లైఫ్ స్టైల్: ఈ వేసవిలో వీటిని తినడం చాలా ప్రమాదమట..!!

Divya
ప్రస్తుతం ఉన్న ఈ హిట్ సమ్మర్లో దోస కాయలు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు. ఇక అంతే కాకుండా ప్రజలు కూడా వీటిని ఎక్కువగా వినియోగించేందుకు ఆసక్తి చూపిస్తూ ఉంటారు. కేవలం శరీరం చల్లగా ఉండాలంటే వేడి వాతావరణంలో ఈ దోసకాయలను ఎక్కువగా తినాలని పలువురు డాక్టర్లు కూడా తెలియజేస్తూ ఉంటారు. అయితే ఇది ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యానికి కూడా హానికరంగా ఉంటుందట. వాటి గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.

కీరదోసకాయలో ఇతర ఆహార పదార్థాలను జీర్ణం చేసుకోవడానికి చాలా సహాయపడతాయి. కానీ దోసకాయ సొంతగా జీర్ణం త్వరగా అవ్వదు.. కాబట్టి వీటిని రాత్రిపూట తినకూడదు. ఇతర ఆహార పదార్థాలలో కలిపి కూడా వీటిని తీసుకోకూడదు. ఏదైనా భోజనానికి ముందు, భోజనం తర్వాత మాత్రమే వీటిని తినాలట. అయితే వీటిని కేవలం కొన్ని నియమాలను పాటించి తినడం వల్ల అన్ని దుష్ప్రభావాలను నియంత్రించవచ్చు.

ముందుగా ఈ కీరదోసకాయను బాగా కడిగి ఆ పై పొట్టును తీసి వేసి తినాలి లేదంటే చర్మం పైన కొంతమంది మైనపు పూత పదార్ధాన్ని కూడా పూస్తారు. ఇది విష పదార్థం గా ఉంటుందట. పచ్చి దోసకాయలు తినడం వల్ల ఎంతో మందికి గ్యాస్, గుండెల్లో మంట సమస్య వస్తోంది. ఈ దోస కాయలు ముఖ్యంగా విటమిన్ సి చాలా పుష్కలంగా ఉంటుంది. వీటిని ఎక్కువ మోతాదులో తింటే అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు చెదిరి పోతాయట.
ఇక దోసకాయల ఎక్కువ పొటాషియం బలహీనమైన మూత్రపిండాలపై ఒత్తిడి కలిగేలా చేస్తుంది కాబట్టి కిడ్నీ సమస్య తో ఉండే వారు వీటిని తక్కువగా తినడం మంచిది.
గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు వీటిని తినకపోవడమే మంచిది.. ఎందుకంటే ఈ కాయ నిండా నీరు ఎక్కువగా ఉంటుంది కనుక ఆ నీరు గుండె ఒత్తిడిని సృష్టిస్తుంది.. కేవలం దోసకాయ శరీరాన్నిచల్లబరిచే మాట వాస్తవమే అయినప్పటికీ క్రమంగా సైనస్ అనే సమస్యలను కూడా ప్రభావితం చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపుణులు తెలియజేశారు. కేవలం రోజులో ఒక దోస కాయ తింటే చాలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: