వెదురు లోని రకాలు


కలపకు ఆల్టర్నేటివ్ గా విస్తరిస్తున్న గ్రీన్ గోల్డ్ గా ప్రసిద్ధి చెందిన వెదురు కనిపిస్తుంది. అత్యంత వేగవంతంగా పెరుగుతున్న చెట్లలో వెదురు ఒకటి. ఎక్కడైనా ఇది పెరుగుతుంది. నాటిన 5 ఏళ్లకే ఉత్పత్తినిస్తుంది. ఇలాంటి వెదురుతో పలు రకాల జాతులు ఉన్నాయి. వాటిని గురించి ఇప్పుడు చూద్దాం. 

వెదురు  అనేకరకాలుగా ఉపయోగపడుతుంది. వీటి గింజలతో కల్లు తయారు చేస్తారు.వెదురు మానవునికి ఎన్నో విధాలుగా ఉపయోగంలో ఉంది. ఇళ్ళ నిర్మాణాల్లో వెదురు వినియోగించుకుంటారు. వైద్య సంబంధిత కార్యక్రమాలకు వెదురు చాలా బాగా ఉపయోగపడుతుంది.  


వెదురులో  అనేక  జాతులు, రకాలు ఉన్నాయి. వాటిలో మనకు ఇప్పటి వరకు  తెలిసినవి కొన్ని మాత్రమే ఇప్పుడు కొన్ని రకాల గురించి తెలుసుకుందాం. 



బాంబుస పాలిమేర్ఫా : 


దీన్నే జమ బేట్వా, నారంగి బాన్స్ , బారి అని కూడా పిలుస్తారు. ఈశాన్య రాష్ట్రాల్లోని అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, త్రిపుర లలో దీన్ని చూడవచ్చు. ఈ కోవకు చెందిన వెదురు మంచి సారవంతమైన ఒండ్రు నేలల్లో బాగా పెరుగుతుంది. లేత ఆకుపచ్చ , గ్రేయిష్ గ్రీన్ రంగులలో ఉంటుందీ రకం వెదురు. 



వీటిలో కొన్ని వైట్ గ్రే రంగుల్లో కూడా ఉండవచ్చు. ఇది 25 మీటర్లు పొడవు ఉంటుంది. దీని చివుళ్లను కురాగా వినియోగిస్తారు. హస్తకళాకృతులు తయారీకి , ఇంటి నిర్మాలలోను, వెదురు గుజ్జుగాను వాడుతారు. 





బాంబుస వల్గరిస్ : 

మధ్య భారతంలోను, ఈశాన్య భారత లోను ఉన్న అడవుల్లో ఈ రకం వెదురును చూడవచ్చు. తేమగా ఉండే నేల దీనికి అనువైన ప్రాంతం. ఇవి గుంపుగా పెరుగుతాయి. ఇవి నిమ్మ పసుపు రంగులో లేదంటే ప్రకాశవంతమైన ఆకుపచ్చ చారలతో ఉంటాయి. 20 మీటర్లు పొడవుతో , నునుపుగా ప్రకాశవంతంగా ఉంటాయి. 




దీన్నే బసిని బాన్స్ , బకల్ అని కూడా పిలుస్తారు. ఈ రకం వెదురును కాగితం తయారీకి , అలంకరణ వస్తువులు , హస్తకళా సామగ్రి తయారీకి ఎక్కువగా వాడతారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: