హ్యాపీ సండే : శ్రీమంతుడి కథకు వీరే అర్థం? జయహో ప్రవాసీ!
మనిషికీ నేలకూ మధ్య మరో అవధి లేదు
దేహం తప్ప మరో అవధి లేదు
దేహం కలిశాక మట్టిలో మరో అవధి లేదు
నిశీధిని తరిమే అవధి నీ దేహం ఆ వెలుగు నీ దేహం
ఆ క్రాంతిని ఈవేళ ఆరాధిస్తే కొత్త వెలుగు సంప్రాప్తి సాధ్యమే
రా రా శ్రీమంతుడా!
మన మూలాల్లో మనవాళ్లే ఉన్నారు.. మన నేల గంధాల్లో మన వాళ్లే ఉంటారు.."నలుగురు కూచుని నవ్వే వేళల నా పేరొకతరి తలవండి..."అని గురజాడ చెప్పిన విధంగా నేలను తలచి నింగి దారుల్లో ప్రయాణిస్తారు.. నేలకూ నింగికీ ఆడంబరం లేని వారథి నా ప్రవాస భారతీయం.. ఆ గొంతు అజరామరం.ఆ సేవ అనుపమానం.వారి కృషికి శ్రీరామ రక్ష..వారి భవితకు శ్రీ రామ రక్ష..
దేశానికి మంచివాళ్ల ప్రగతి అవసరం
మన నుంచి వాళ్లు వెళ్తారా లేదు
కేవలం దేహం అక్కడ హృదయం మాత్రం
మా నేల వైపే ఉంటుంది. మమతకు
ప్రతిరూపం అయి జన్మభూమి రుణం
కాస్త తీర్చుకునే గొప్ప మనసులకు
మనం వందనాలు చెల్లించాలి...
ఎంతో మంది శ్రీమంతులు.బడిని బాగు చేశారు..గుడి నేలను చదును చేసి పునర్నిర్మాణంకు సహకరించారు..ప్రవాసీయులే వారు మట్టితో ఉన్న బంధం తెంపుకోలేక పెద్దవాళ్లయిన కొద్దీ సేవ స్థాయిని పెంచుకుంటూ పోతున్నారు. పొరుగు దేశాన ఉంటూ స్వదేశానికి ఎప్పటికప్పుడు ఉన్నంతలో పంచడం ఓ అలవాటుగా మార్చుకున్నారు..ఈ సారి ప్రవాస భారత్ దివస్ ఎంతో ప్రత్యేకం కరోనా కష్ట కాలంలో వాళ్లే లేకుంటే మనకు ఆక్సిజన్ సిలిండర్లు ఉండవు..కొందరికి నిత్యావసరాలు ఉండవు.కొందరికి వైద్యం అందదు ప్రాణం నిలవదు..కనుక నిజమైన దేవుళ్లు నా భారతీయులు నా ప్రవాస భారతీయులు అని చెప్పండిక.. సంపద ఉన్నంత కాలం పంచాల్సిందే! సంపాదించుకున్నదాంట్లో కొంత పంచి, వృద్ధి సాధించాల్సిందే!
దేశం కానీ దేశంలో కూడా మనం నెగ్గుకు రావాలి..దేశం కానీ దేశంలో విద్య, వైద్య, ఉపాధి రంగాల్లో రాణిస్తూ సొంత వారికి, సొంత ఊరికి సాయం చేయాలి..ఊరిని దత్తత తీసుకున్నంత పెద్ద మనసుకు జేజేలు పలకాలి.. ఊళ్లో కల్యాణ మండపం కట్టించిన మనసుకు వందనాలు చెప్పాలి.. ఏదేమయినా సాయం చేసే చేయిని ముద్దాడి మన స్వేద వేదాల తీరును మరోసారి స్మరించాలి.అవును!
ఇండియా ఎదుగుదలకు ప్రవాసీయుల సాయం ఎంతో! కష్టం అంటే కరిగి కన్నీరయి సాయం చేసే హృదయాలకు మరో మారు ఇవాళ ఈ ఆదివారాన, ఈ వారాంతాన శుభాకాంక్షలు.
ఇవాళ ప్రవాస భారతీయుల దినోత్సవం.అంటే మాతృభూమి రుణం తీర్చుకుంటున్న వారిని తల్చుకోవాలి అని! ఆ విధంగా భారత్ నుంచి వెళ్లి ఎక్కడెక్కడో స్థిరపడిపోయి తిరిగి కన్న ఊరికి సాయం చేసే పెద్ద మనసున్న వారిని తల్చుకోవాలి అని! ఒక లెక్క ప్రకారం మన దేశం నుంచి వెళ్లిన వారి సంఖ్య వారు పంపే డబ్బు అన్నీ కూడా ఎవ్వరూ ఊహించలేనంత..గత ఏడాది వీళ్లంతా కరోనా కష్టకాలంలో సొంత వారికి సాయం చేయాలన్న తలంపుతో పంపిన మొత్తం ఎంతో తెలుసా 6.4లక్షల కోట్లు.