గ్రీన్ వాష్ వద్దు.. గ్రీన్ పీస్.. !

సాంకేతికత పేరుతో ఆయా దేశాలలోని కార్పొరేట్ సంస్థలు తీవ్రంగా వాతావరణ కాలుష్య భరితమైన ఉత్పత్తులను తయారుచేస్తూ, కనిపించిన అడవులను, చెట్లను నరుక్కుంటూ పోతున్నారు. దీనితో ఎక్కడా పచ్చదనం లేకుండా పోతుంది. ఈ పరియవసానంగా ప్రకృతిలో తీవ్రమైన మార్పులు సంభవిస్తున్నాయి. వేడి పెరిగిపోతుంది. మనిషికి కావాల్సిన అత్యవసరాలు నీరు, గాలి చాలా వరకు కలుషితం అయిపోయింది. దీనితో ప్రపంచంలోని పర్యావరణ ప్రేమికులు గ్రీన్ పీస్ గా ఏర్పడ్డారు. వీళ్ళందరూ ఎప్పటికప్పుడు పర్యావరణాన్ని హరించే వాళ్లపై పోరాటాలు చేస్తుంటారు. తాజాగా ఈ నెల 31న ఐక్యరాజ్య సమితి  భూతాపంపై, పెరిగిపోతున్న కాలుష్యంపై అనేక దేశాలతో సమావేశమై చర్చించనుంది.
ఈ సమావేశంలో పలు దేశాలు కాలుష్య కారకాలను తగ్గించుకునే విధంగా ఒప్పందానికి రానున్నాయి. దానికి ఆయా సంస్థలు, ప్రభుత్వాలు హామీలు ఇచ్చేవిధంగా చర్యలు ఉంటాయని భావిస్తున్నారు. ఈ చర్చలు సఫలం అయ్యేందుకు వాతావరణ ప్రేమికులు కూడా వారి కృషి చేస్తున్నారు. కాలుష్య నివారణ పేరుతో ఇప్పటివరకు తీసుకున్న చర్యలు ఆశాజనకంగా లేవని గ్రీన్ పీస్ అభిప్రాయపడింది. ముఖ్యంగా కార్పొరేట్ సంస్థలు ఈ విషయంలో అసలు సహకరించకపోగా వాళ్ళు గ్రీన్ వాష్ ఎక్కువగా చేస్తున్నారని గ్లాస్గో చర్చలలో భాగంగా కార్పొరేట్ సంస్థలు, ఆయా దేశాల పట్ల గ్రీన్ పీస్  జెన్నిఫర్ మోర్గాన్ విచారం వ్యక్తం చేశారు. ఈ సమావేశాలు చాలా విలువైనవి, ఆయా ప్రభుత్వాలు, సంస్థలు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన సందర్భం వచ్చేసింది అని మోర్గాన్ అన్నారు.
ప్రభుత్వాలు చేయడానికి కార్పొరేట్ సంస్థలు అడ్డుపడుతున్నప్పటికీ ఈ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ప్రస్తుతం వచ్చేసిందని మోర్గాన్ అన్నారు. ఈ సంస్థల వలన వచ్చే వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి సాధించిన పురోగతికి చాలా పెద్దఎత్తున అడ్డంకులు ఎదురవుతున్నాయని ఆమె అన్నారు. ఇందులో కార్పొరేట్ వాళ్ళు చేసే లాబియింగ్ ఎక్కువ ఉంటుంది. తామేదో అందరికి మంచి చేస్తున్నట్టు వాళ్ళు పైకి కనిపిస్తారు తప్ప చేతలలో ఒక్కటి కూడా అలా ఉండబోదు.  భూతాపాన్ని తగ్గించేందుకు ఉన్న ఒకే అవకాశంగా బ్రిటన్ ఈ సమావేశాలను అభివర్ణించింది. ఈ సదస్సుకు భారత్  హాజరవనున్నారు. భూతాపం రెండు శాతం కంటే పెరగకుండా పారిస్ ఒప్పందాన్ని అమలు చేస్తామని భారత్ ఇప్పటికే హామీ ఇచింది. ఇక అభివృద్ధి  పెద్దఎత్తున హామీలు ఇస్తారు తప్ప అందుకో ఒక్కటికూడా అమలు చేయబోరని మోర్గాన్ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: