లైఫ్ స్టైల్: జిమ్ చేయడం వల్ల బరువు తగ్గుతారా..?

Divya
సాధారణంగా బరువు పెరిగిన వారు తమ శరీర బరువును తగ్గించుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే బరువు తగ్గడానికి ఎటువంటి ప్రక్రియను మనం ఎంచుకోవాలి అనేది మాత్రం చాలా పెద్ద సమస్యగా మారింది. ఈ మధ్య కాలంలో చాలా మంది బరువు తగ్గడం కోసం జిమ్ లో చేరి ఎక్కువగా ఎక్సర్సైజులు చేస్తున్నారు.. కానీ ఆరోగ్య నిపుణులు మాత్రం బరువు తగ్గడం కోసం ఎక్సైజ్ చేయడం అనేది ఒక అంచనా కంటే చాలా ఎక్కువ అని నమ్ముతున్నారు.. ముఖ్యంగా చాలామంది జిమ్ లో చేరి కార్డియో ఎక్కువగా చేస్తున్నారని సమాచారం.

అయితే ఇలా ప్రతిసారి కార్డియో అనేది చేయడం వల్ల ఖచ్చితంగా గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగజేస్తుందట. బరువు తగ్గడం కోసం కార్డియో మీద ఆధారపడితే ఎటువంటి ప్రయోజనం ఉండదు అని వైద్య నిపుణులు చెబుతున్నారు... కార్డియో చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరిగి శరీరంలో కూడా కొలెస్ట్రాల్ శాతం కూడా తగ్గుతుంది.. కానీ చాలా మందిలో ఎదురు దెబ్బలు కూడా తగిలే ప్రమాదం ఉంటుందట.. ఇక కార్డియో గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం.

చాలామంది కార్డియో చేయడం వల్ల శరీరంలోని క్యాలరీలు తగ్గి పోతాయి అని అనుకుంటారు.. కానీ ఇది ఏ మాత్రం నిజం కాదు.. ఎందుకంటే శరీరంలో కేలరీలు తగ్గకపోగా మనకు ఆకలి పెరుగుతుంది. ఆకలి పెరగడం వల్ల మనలో చాలామంది కేలరీలు బాగా ఖర్చయ్యాయి అని ఊహించుకుంటారు.. కార్డియో చేయడంవల్ల ఆకలి ఎక్కువగా వేయడంతో మన మనస్సు కూడా తిండి వైపే మళ్ళి ఇక బరువు తగ్గాలనే ఆలోచన కూడా కోల్పోవడం జరుగుతుంది. అయితే ఎవరైతే  బరువును చూసుకుంటూ అధిక బరువును తగ్గించుకోవడానికి కార్డియో చేస్తున్నారో అలాంటి వాళ్ళు ప్రయోజనమేమి పొందక నిరాశకు గురి అవుతారు.. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు జిమ్లో కార్డియో మాత్రం చేయకండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: