లైఫ్ స్టైల్: ఇలా చేస్తే నిత్య యవ్వనం మీ సొంతం..!

Divya
నిత్యం యవ్వనంగా కనిపించాలని ఎవ్వరికీ అనిపించదు.. అయితే ఇందుకోసం రకరకాల ప్రయత్నాలు చేసినప్పటికీ ముఖాన్ని మాత్రమే వీళ్లు అందంగా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి ముఖంపైన మొటిమలు ఉంటే ఇక అంతే సంగతి.. ఎంత అందంగా నాజూగ్గా కనిపించిన ముఖం మీద కనిపించే మొటిమల కారణంగా.. ఉన్న అందం మొత్తం పోయి ముఖం మీద మొటిమలు మచ్చాల్లా..ముడతలా ఏర్పడుతూ ఉంటాయి. అయితే కొన్ని ఆసనాలు చేయడం వల్ల ముఖం మీద మొటిమలు తగ్గిపోవడంతో పాటు గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం అవుతుంది..

చర్మంపై గ్లోయింగ్ నిచ్చే ఆసనాల విషయానికి వస్తే యోగాలో ప్రాణాయామం ఎంతటి  చక్కటి ఫలితాన్ని ఇస్తుందో ప్రతి ఒకరికి తెలిసిన విషయమే. ఇందులో భాగంగానే శీర్షాసనం.. హలాసనం.. సర్వాంగాసనం.. కర్ణ ఫీడ్ ఆసనం వంటి ఆసనాలు చర్మానికి మంచి మెరుపును తీసుకొస్తాయి..
అయితే ఈ ఆసనాలు వేయడానికి కొంచెం కష్టం అనిపించినా కానీ వీటిని వేయడం వల్ల ముఖం మీద మచ్చలు రావట.. ఈ ఆసనాలు వేయడం వల్ల రక్త ప్రసరణ బాగా జరిగి.. శరీర అవయవాల పనితీరు కూడా మెరుగుపడుతుంది.. ముఖ్యంగా శరీరంలో ఉండే అన్ని అవయవాలకు రక్తం సరఫరా అవ్వడం తో పాటు ఆక్సిజన్ కూడా సమపాలల్లో చేరుతుందట.. ఒక ఆసనం గురించి తెలుసుకుందాం..
పాదహస్తాసనం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా మీరు సమస్థితిలో ఈ ఆసనాన్ని మొదలు పెట్టాలి..
ముందుగా నెమ్మదిగా ఊపిరి వదులుతూ మీ అప్పర్ బాడీని కొంచెం కిందకి వంచండి. అప్పుడు మీరు మీ భుజాలు , మెడ అలాగే రిలాక్స్డ్గా ఉండాలి.. ఇక తలను కూడా కిందకు వంచాలి. కొంచెం కొత్తగా మొదలు పెట్టే వాళ్ళు అయితే అవసరాన్ని బట్టి కూడా మీరు మీ మోకాళ్లను కొద్దిగా వంచవచ్చు. మీ అరిచేతులు మీ పాదాలు పక్కనే ఉండాలి. కొన్ని నిమిషాల పాటు ఈ ఆసనం లో ఉండడం వల్ల రక్త ప్రసరణ కూడా అన్ని విధాల బాగా జరిగి, ముఖంలో గ్లో రావడంతో పాటు నిత్య యవ్వనంగా ఉంటారు. సరైన ఆహార పదార్థాలు తీసుకొని, ఎక్కువగా తాగుతూ రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవడం వంటి అలవాట్లు ఎంతగానో దోహదం చేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: