ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ : అంతా అసత్యాన్నే చెబుతాను!
గాంధీ తరువాత కూడా గాంధీలు ఉన్నారు. ఉంటారు కానీ, వారికి సమాజం గుర్తింపు ఉండదు. ఉన్నా అది రాజకీయ గుర్తింపు అవుతుంది అన్న భయం ఒకటి ఉంది. రాజకీయ గుర్తింపులు వద్దు కానీ సామాజిక గుర్తింపు అన్నది గౌరవనీయ స్థానం వైపున కు మళ్లిస్తుంది. ఇంకా ఇప్పటికీ గాంధీ ఎందుకనో నచ్చడు. ఎందుకనో నచ్చుతాడు. మనుషుల తప్పిదాల్లోనూ, మనుషుల కోపా ల్లోనూ గాంధీ ఉన్నాడు కనుక నచ్చేడు. లేకపోతే ఈ పాటికి మనం ఇంకొంక బాపూజీని వెతికేవాళ్లం.. ఆ పని గాంధీ చేయనివ్వడం లేదు... మనుషుల అవివేకంలోనూ, కీర్తి కాంక్షలోనూ గాంధీ ఉన్నాడు కనుక పచ్చనోటుపై హాయిగా నవ్వుతుంటే నేనూ చూసి న వ్వేను..అంతకుమించి ఆ నవ్వు సాధించిందేమీ లేదు..మన లాంటి వాడే గాంధీ అని ఎవ్వరు అన్నా నవ్వుకోండి.. దేశానికి మరో మహాత్ముడు గుజరాత్ నుంచే రావాలని కోరుకుని హాయిగా ఉండండి.. అన్నట్లు ఇప్పటి మోడీ మహాత్ముడే కావొచ్చు..తెలియదు వెతకండి.. పాపం ఆయనను మహాత్మా అని పిలిచిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఇది విని ఏమౌతాడో అన్నది ఓ సందేహం.
మహాత్ముడు అనే పదం దగ్గర ఆగిపోయాను. కొన్నేళ్ల పాటూ ఇలాంటి పదాలు విని విని హాయిగా నవ్వుకుంటున్నాను. మహా త్ముడు అనే పదం ఒక ఆ మహాత్ముడికే చెల్లించి, మిగతావారిని మనం తయారు చేయలేకపోవడంలో ఉన్న తప్పిదం ఇది అని గుర్తించా ను. అయినా మహాత్మా అన్న పదం శ్రామిక శక్తి నుంచి పుట్టించింది కాదు ఒక దేశ ఔన్నత్యం గురించి చెప్పి, చెప్పి చా టింపు వేసినప్పుడు దొరికిన ఐకానిక్ వర్డ్. మహాత్మా అన్నది ఒక ఐకానిక్ వర్డ్ . గాంధీ అనే వ్యక్తికి ఆ పదం వరం కావొచ్చు. త ప్పేం లేదు.
వంద కోట్లకు పైగా ఉన్న దేశాన అలాంటి అంగీకారంపై వ్యతిరేకత ఉన్నా ఇప్పుడది చెల్లదు. అలాంటివి చెప్పినా విభేదం నుంచి వైరం నుంచి వివాదాలు వస్తాయి. వివాదాలు కానివేవైనా ఉంటే ఎంచుకుని మాట్లాడడం నేర్చుకోవాలి. గాంధీ వివాదం కాదు. ని నాదం అయి ఉన్నాడు. కనుక తప్పులు చెప్పి అబద్ధాలు చెప్పి అసత్యాలు చెప్పి ఆయనకు అగౌరవం తీసుకు రాకండి. కానీ ఇవా ళ నేను అసత్యాన్నే చెబుతాను. అసత్యం అనే ఓ ప్రాంగణాన మనుషుల కొట్లాటలను ప్రేమించాలి. ప్రేమ అన్నది యుద్ధ సంబంధ మే కాదు ఇంకా ఏమయినా కావొచ్చు. అభిప్రాయ భేదం కూడా ప్రేమే కావొచ్చు.
అలాంటి ప్రేమను ప్రేమిస్తే అసత్యాలు అన్నీ సత్యాలుగా మారిపోతాయా? హా హా ! ఏదయినా ఒక మంత్రం చెప్పడం నేర్చుకోండి పాలకులూ! మీరనుకున్నవి నేను చెప్పేవి మీ కళ్లద్దాల మాటు నిజాలు ఏంటన్నవి తేలిపోవాలి. తేలిపోతాయి కూడా! మాట తేలిక మౌనం భారం. భారం అనుకున్న స్థితిని జయించి మాట్లాడడంలో మనుషులు ఉండరు. అవినీతి తేలిక ... నీతి భారం.. నీటి రాత కూడా కొన్ని సార్లు .. కనుక భారం అనుకున్నవి జయించడంలో మనుషుల సంసిద్ధత ఒకటి తప్పక ఉండాలి. అశాంతిని జయిం చడం, అసత్యాన్ని నిలువరించడం, అవినీతిని అడ్డుకోవడంలో చేతగాని తనం భారతీయుల్లో ఉందండి. భారతీయులు మోస్తున్న భారం అంతే ఇదే! అందుకే ఇవాళ అంతా అసత్యాన్నే చెబుతాను.
- రత్నకిశోర్ శంభుమహంతి
ఆర్ట్ : హరి తాడోజు