లైఫ్ స్టైల్: దగ్గు తగ్గించే సిరప్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చట..!

Divya
దగ్గు లో చాలా రకాలు ఉన్నాయి.. ఒకరికి పొడి దగ్గు వస్తే .. మరొకరికి కోరింత దగ్గు వస్తుంది.. ఈ దగ్గు ఎలాంటిదైనా సరే ఒక్కసారి దగ్గు వచ్చింది అంటే.. మనిషికి ఎంతో ఇబ్బందిగా అనిపిస్తుంది. దగ్గు ఎక్కువగా రావడం వల్ల ధమనులలో మంట, తలనొప్పి, ఊపిరితిత్తులు పట్టేసినట్టు అనిపించడం ఇలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. ఈ దగ్గు ఎలా వచ్చినా..ఎలాంటి పేర్లతో పిలిచినా.. సమస్య మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. దగ్గు వచ్చినప్పుడు కొంతమంది వంటింటి చిట్కాలు పాటిస్తే , మరికొంత మంది వైద్యులను సంప్రదించి , వారు ఇచ్చే సిరప్ ను తాగుతూ ఉంటారు. ఆస్పత్రుల్లో ఇచ్చే సిరప్ కన్నా ఇంట్లోనే తయారుచేసుకునే సిరప్ ను తాగడం వల్ల త్వరగా ఉపశమనం కలుగుతుంది. అయితే దగ్గు తగ్గించే సిరప్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం..

దగ్గు సిరప్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు..
కొద్దిగా అల్లం, 2 టేబుల్ స్పూన్ తేనె, రెండు నిమ్మకాయలు, నీళ్ళు..
తయారీ విధానం:
అల్లంను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.. నిమ్మకాయల కట్ చేసి వాటిని నుండి రసం తీసి, నిమ్మకాయ తొక్కలను జెస్టర్  సహాయంతో చిన్నగా తురమాలి. ఒక పాన్ తీసుకొని, స్టౌ మీద పెట్టి అందులో ఒక కప్పు నీరు పోయాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకొన్న అల్లం ముక్కలను, ఒక పావు కప్పు ఆ నీటిలో వేయండి. ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల తరిగిపెట్టుకున్న నిమ్మకాయ తొక్కల పొడిని అందులో కలపండి. ఐదు నుంచి పది నిమిషాలు ఈ మిశ్రమాన్ని తక్కువ మంటపై స్టవ్ మీద బాగా మరిగించి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి.
ఇక ఈ ద్రావణం చల్లగా అయిన తర్వాత వడకట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మరొక చిన్న పాన్ తీసుకొని అందులో ఒక కప్పు తేనె వేసి, కొద్దిగా వేడి చేయండి. తేనె వేడిగా అయిన తరువాత పక్కన పెట్టుకున్న ద్రావణాన్ని అందులో కలిపి బాగా మిక్స్ చేయాలి. ఇక ఇందులో ఇప్పుడు పక్కన పెట్టుకున్న నిమ్మరసాన్ని బాగా కలపండి. లో ఫ్లేమ్ మీద కొద్దిగా కలుపుతూ తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. అంతే దగ్గును తగ్గించే సిరప్ రెడీ అయినట్టే..

ఒకటి నుండి పన్నెండు సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు రెండు గంటలకు ఒకసారి ఆఫ్ టేబుల్ స్పూన్ ఇది తాగితే సరిపోతుంది. పెద్దవారు నాలుగు గంటలకు ఒకసారి ఒక టేబుల్ స్పూన్ ఈ సిరప్ తాగితే త్వరగా దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: