ఈ నీళ్లు చాలా హాట్ గురూ !!!
స్వచ్ఛమైన నీరు ప్రస్తుత కాలంలో చాలా ఖరీదైన వస్తువుగా మారింది. నీరు ప్రకృతి వనరు. నీరే లోకంలోని సమస్త జీవులకు ప్రాణాధారం. అయితే కాలగమనంలో నీరు వ్యాపార వస్తువైంది. నిత్యం కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందంటే ఆశ్చర్యమేస్తుంది. ప్రతి గ్రామంలో నేడు, ప్రభుత్వేతర సంస్థలు మంచి నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఇరవై లీటర్ల నీటి క్యాన్ ధర పది రూపాయల లోపు నుంచి ప్రారంభమవుతుండటంతో ప్రతి ఒక్కరూ ఈ ప్రాసెస్ చేసిన నీటినే తాగేందుకు ఆసక్తి చూపుతున్నారనడంలో సందేహం లేదు.
స్వచ్ఛమైన నీరు ఏదయినా ఆరోగ్యానికి మంచిదనుకునే రోజులు పోయాయి. నీటిలో ఉండే గుణగణాలను బట్టి వాటి ధరల్లోను మార్పులొస్తున్నాయి. లీటరు నీటిలో ఉండే ఆల్కలైన్లు, పి.హెచ్ శాతాన్ని బట్టి వాటి ధరల్లో తేడాలుంటాయి. నీటిని విక్రయించే కంపెనీ బ్రాండ్ ఇమేజిని బట్టి కూ డా ధరల్లో తేడా ఉంటుంది. నీటిలో స్వచ్ఛతను ఆ కంపెనీ తన ప్రకటనల్లో తెలియజేస్తున్నందునే అంత ధర ఉంటుందని సమర్థించుకునే వారు కూడా ఉన్నారు.
జపాన్ దేశం ఫసిఫిక్ తీర ప్రాంతంలో నుంచి నిత్యం రెండ లక్షల నీటి బాటిళ్లను దిగుమతి చేసుకుంటుందని అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం. లీటర్ వాటర్ బాటిల్ ధర దాాదాపు యాభై వేల రూపాయల పైచిలుకే మరి.
జపాన్ లోనే ఖరీదైన మంచి నీరు దొరుకుతోంది. ఆ దేశంలో కొబె పర్వతాల దగ్గర నునోబి ప్రాంతంలోని స్వచ్ఛమైన నీరు కూడా ప్రపంచ ఖ్యాతి పొందింది. ఈ ప్రాంతంలో నీటి బుగ్గల నుంచి నీటిని సెకరిస్తారు. వాటిని స్వరోవ్ స్కీ అనే రాళ్లతో ప్రత్యేకంగా తయారు చేసిన వాటర్ బాటిళ్లలో నింపుతారు ఈ నీరు లీటర్ బాటిల్ ధర పాతిక వేల రూపాయలు పై చిలుకే ఉంటుంది.