ఈ నీళ్లు చాలా హాట్ గురూ !!!

ఈ నీళ్లు చాలా హాట్ గురూ !!!
స్వచ్ఛమైన నీరు ప్రస్తుత కాలంలో చాలా ఖరీదైన వస్తువుగా మారింది. నీరు ప్రకృతి వనరు. నీరే లోకంలోని సమస్త జీవులకు ప్రాణాధారం. అయితే కాలగమనంలో నీరు వ్యాపార వస్తువైంది. నిత్యం కొన్ని లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతోందంటే ఆశ్చర్యమేస్తుంది.  ప్రతి గ్రామంలో నేడు, ప్రభుత్వేతర సంస్థలు మంచి నీటి శుద్ధి ప్లాంట్లను ఏర్పాటు చేశాయి. ఇరవై లీటర్ల నీటి క్యాన్ ధర పది రూపాయల లోపు నుంచి ప్రారంభమవుతుండటంతో ప్రతి ఒక్కరూ ఈ ప్రాసెస్ చేసిన నీటినే తాగేందుకు ఆసక్తి చూపుతున్నారనడంలో సందేహం లేదు.
 స్వచ్ఛమైన నీరు  ఏదయినా ఆరోగ్యానికి మంచిదనుకునే రోజులు పోయాయి. నీటిలో ఉండే గుణగణాలను బట్టి వాటి ధరల్లోను మార్పులొస్తున్నాయి. లీటరు నీటిలో ఉండే ఆల్కలైన్లు, పి.హెచ్ శాతాన్ని బట్టి వాటి ధరల్లో తేడాలుంటాయి. నీటిని విక్రయించే కంపెనీ బ్రాండ్ ఇమేజిని బట్టి కూ డా ధరల్లో తేడా ఉంటుంది. నీటిలో స్వచ్ఛతను ఆ కంపెనీ తన ప్రకటనల్లో తెలియజేస్తున్నందునే అంత ధర ఉంటుందని సమర్థించుకునే వారు కూడా ఉన్నారు.
జపాన్ దేశం ఫసిఫిక్ తీర  ప్రాంతంలో నుంచి నిత్యం రెండ లక్షల  నీటి బాటిళ్లను దిగుమతి చేసుకుంటుందని అంతర్జాతీయ వార్తా సంస్థ కథనం.  లీటర్ వాటర్ బాటిల్ ధర దాాదాపు యాభై వేల రూపాయల పైచిలుకే మరి.

 పసిఫిక్ తీర ప్రాంతంలోని హవాయి అనే ప్రదేశంలో దాదాపు రెండు వేల అడుగుల లోతు నుంచి నీటిని మరగొట్టాల ద్వారా వెలికి తీస్తారు |ఈ నీటికి కోనాగిరి అనే పేరుంది. ఈ నీటిలోని ఉప్పదనాన్ని పోగొట్టి ప్రత్యేకమైన బాటిళ్లలో నింపుతారు. వేల అడుగుల లోతులోనుంచి వెలికి తీయడం వల్ల ఉపరితలం పై ఏర్పడే పర్యావరణ హాని ఈ నీటికి అంటదని  ఆ కంపెనీ తన ప్రకటనల్లో పేర్కంటోంది. తమ నీాటిని ేతాగితే ఎట్టి పరిస్థితుల్లోనూ బరువు పెరగరని, చర్మం నిగారింపు సంతరించుకుంటుదని కూడా  సదరు కంపెనీ  తమ ఖాతాదారులకు నమ్మబలుకుతోంది.
జపాన్ లోనే ఖరీదైన మంచి నీరు దొరుకుతోంది. ఆ దేశంలో కొబె పర్వతాల దగ్గర నునోబి ప్రాంతంలోని స్వచ్ఛమైన నీరు కూడా  ప్రపంచ ఖ్యాతి పొందింది. ఈ ప్రాంతంలో నీటి బుగ్గల నుంచి నీటిని సెకరిస్తారు. వాటిని  స్వరోవ్ స్కీ అనే రాళ్లతో ప్రత్యేకంగా తయారు చేసిన వాటర్ బాటిళ్లలో నింపుతారు ఈ నీరు లీటర్ బాటిల్ ధర పాతిక వేల రూపాయలు పై చిలుకే ఉంటుంది.

ఫైన్ వాటర్ సొసైటీ అనే సంస్థ ఉత్తర దృవ ప్రాంతంలో నీరు ప్రపంచంలో అత్యంత రుచికరమైన నీరు అని పేర్కొంది. మంచు కొండలు కరిగినప్పుడు ఆ నీటిని సేకరించి బాటిళ్ల ద్వారా ఓ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలు జరుపుతోంది. ఈ నీటి ధర దాదాపు ఇరవై వేల  రూపాయల పైచిలుకే ఉండటం గమనార్హం. అంతే కాదండోయ్ అమెజాన్ అడవుల్లో ఓ మల్టీ నేషనల్ కంపెనీ తన కేంద్రాన్ని ఏర్పాటు చేసింది.  అక్కడి స్వచ్ఛమైన గాలి లోని తేమను ఒడిసి పట్టి వాటిని నీరుగా మార్చి వ్యాపాం చేస్తోంది.  ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది రాజకీయ నాయుకులు, క్రీడాకారులు,  సినీ కళాకారులు, సెలబ్రిటీలు ఈ నీటికి తాగేందుకు తహతహ లాడతున్నారు. ఈ నీటి ధర పై వాటితో పోలిస్తే కొంత మేలు . లీటరు నీటి ధర పలుకుబడి గల్గిన వారికి పదివేల రూపాయలలోపే దొరికే అవకాశం ఉంది. మంచి నీరా ? మజాకా !!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: