లైఫ్ స్టైల్: మనకు తెలియకుండానే ఈ అలవాట్లు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయి అని తెలుసా..?

Divya
ఒక్కోసారి మనం చేసే పనుల వల్ల మన ఆరోగ్యం చెడిపోతుందని , మనకున్న అలవాట్ల కారణంగా తెలియకుండానే మన ఆరోగ్యం చెడిపోతుందని కొంతమంది నిపుణులు చెబుతున్నారు. ఈ అలవాట్ల కారణంగా ఒక్కోసారి ప్రాణాంతకం కూడా కావచ్చు అని హెచ్చరిస్తున్నారు. అయితే మనకు తెలియకుండానే మనం చేసే పనుల వల్ల, మనం ఏవిధంగా నష్టపోతున్నాము అనే విషయాలను ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం..
1. సాధారణంగా మగవారు తమ బ్యాక్ పాకెట్ లో వాలెట్ పెట్టుకోవడం అలవాటు చేసుకుంటారు.. బ్యాక్ పాకెట్ లో వాలెట్ పెట్టుకోని కూర్చున్నప్పుడు అందులో ఉండే ఏటీఎం కార్డులు విరిగిపోయే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఒక వైపు ఎత్తుగా మరోవైపు తక్కువ ఎత్తులో కూర్చోవడం వల్ల వెన్నెముకకు బ్యాలెన్స్ తప్పి వెన్నెముక విరిగే అవకాశం కూడా ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రతి ఒక్కరు సైడ్ పాకెట్ లో వాలెట్ పెట్టుకోవడం మంచిదట.
2. చాలామంది తుమ్ము వచ్చినప్పుడు మీటింగ్ లో ఉన్నప్పుడు లేదా ఎదుటి వ్యక్తి తో మాట్లాడుతున్నప్పుడు తుమ్ములు ఆపుకుంటూ ఉంటారు. సాధారణంగా తుమ్మేటప్పుడు గాలి శరీరం లోపలి నుంచి శ్వాసనాళాల ద్వారా 160 కిలోమీటర్ల వేగంతో బయటకు వస్తుందట.అయితే  ఒక్కసారిగా అంత  వేగాన్ని మనం ఆపుకున్నట్లయితే కర్ణబేరి పాడవుతుందట. కళ్ళు, మెదడు, ముక్కులోని నరాలు కూడా క్రమంగా దెబ్బతినే ప్రమాదం ఉంటుందట.
3. మల విసర్జన , మలమూత్రం ఆపుకోవడం చాలా తప్పు. ఇలా చేయడం వల్ల అందులో ఉండే చెడు బ్యాక్టీరియా రక్తంలో కలిసి బ్లాడర్ కండరాలు క్షీణిస్తాయి. అంతే కాదు ఒక్కసారిగా ఆపుకొని, తర్వాత  యూరిన్ కి వెళ్ళినప్పుడు బ్లడ్ కూడా వచ్చే అవకాశం ఉంటుందట. బ్లాడర్ పగిలిపోయిన సందర్భాలు కూడా చూశామని వైద్యులు చెబుతున్నారు.
4. అల్పాహారం తీసుకోకపోతే మహిళలకు రుతుస్రావం లో కూడా ఇబ్బందులు తలెత్తుతాయి. అంతేకాదు షుగర్ లెవల్స్ తగ్గిపోవడం, మైగ్రేన్, జుట్టు రాలడం వంటి సమస్యలు అధికమవుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: