ఈ 15 నగరాల్లో డ్రైవింగ్ చేస్తున్నారంటే సాహసమే

Manasa
హైదరాబాద్ అనగానే అందరికీ గుర్తొచ్చేది బిర్యానీ. ఇక్కడ  బిర్యానీ ఎంత ఫేమస్సో ఇక్కడి ట్రాఫిక్ కూడా అంతే. గత రెండు సంవత్సరాలుగా కరోనా మూలంగా ఈ ట్రాఫిక్ గోల నుండి తపించుకోగలిగాము  కానీ ఇకపై మళ్ళీ హెవీ ట్రాఫిక్ సందడిలో చిందులు వేయాల్సిందే. ఇక ఇండియాలో, ప్రత్యేకంగా ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్ ప్రాంతాల్లో  నివసిస్తున్న వారైతే   ఈ నరకానికి తమని తాము అలవాటు చేసుకున్నారు.
 
పాపులేషన్  ఎక్కువ ఉండటం చేత మనకు ఇది తప్పనిసరి. ఒకపుడు ఐతే కేవలం పగటివేళలో మాత్రమే బాగా ట్రాఫిక్ ఉండేది కానీ ఈ నైట్ లైఫ్ పుణ్యమాని మధ్యరాత్రి కూడా కొన్ని ప్రదేశాలలో ట్రాఫిక్ మనం చూడొచ్చు. ఇండియా ఒకటే కాదండోయ్ బాగా డెవలప్ అయిన పారిస్ వంటి  దేశాల్లో కూడా ఈ ట్రాఫిక్ సందడులు ఉన్నాయి. ప్రపంచం మొత్తం తిరిగి మరి యూకే బేస్డ్ హియాకర్ అనే కంపెనీ వాళ్ళు- ప్రపంచంలోనే అత్యంత  ఒత్తిడితో కూడిన మరియు ట్రాఫిక్  బాగా ఉన్న నగరాలు ఏవి అని ఇటివల  లిస్ట్ అవుట్ కూడా చేశారు.  మరి వర్డ్స్ 15  మోస్ట్ స్ట్రెస్ ఫుల్ సిటీస్ టు  డ్రైవ్  ఇన్ ఏవో చూద్దామా ?
1 .ముంబై,ఇండియా:7.4
2. పారిస్, ఫ్రాన్స్:6.4
3. జకార్తా, ఇండోనేషియా:6.0
4. ఢిల్లీ, ఇండియా: 5.9
5. న్యూయార్క్, యునైటెడ్ స్టేట్స్: 5.6
6. కౌలాలంపూర్, మలేషియా: 5.3
7. నగోయా, జపాన్: 5.1
8. లండన్, యునైటెడ్ కింగ్‌డమ్: 5.0
9. మెక్సికో సిటీ, మెక్సికో: 4.9
10. ఒసాకా, జపాన్: 4.9
11. బెంగళూరు, భారతదేశం: 4.7
12. రియో డి జనీరో, బ్రెజిల్: 4.7
13. బ్యాంకాక్, థాయిలాండ్: 4.7
14. చికాగో, యునైటెడ్ స్టేట్స్: 4.7
15. టోక్యో, జపాన్: 4.7

ఎక్కడ డ్రైవింగ్ చేసిన,ఎప్పుడు డ్రైవింగ్ చేసిన హెల్మెట్ తప్పక ధరించండి మరియు సీట్ బెల్ట్ అస్సలు మిస్ అవకండి.ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవండి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: