ప్రశాంతత కావాలా? అరిటార్ టూర్ వేయాల్సిందే !

Vimalatha
అరిటార్ తూర్పు సిక్కిం లో ఒక భాగం. ఇది సహజ సౌందర్యం తో పాటు గొప్ప చరిత్రను కూడా కలిగి ఉంది. ఉత్కంఠ భరితమైన సరస్సు, దట్టమైన అడవులు, అందమైన కొండలు, ప్రకృతి ఒడి లో ఉన్న అరిటార్‌లోని ఉదయ దృశ్యం ప్రజలను ఆహ్లాద పరుస్తుంది
సిక్కిం లోని రొంగలి తహసీల్‌లో ఉండే అరిటార్ హిమాలయాల అంచున ఉంది. గ్యాంగ్‌టక్ నుండి పాక్యాంగ్ లేదా రంగ్‌ పో మీదుగా ఇక్కడికి చేరుకోవడానికి నాలుగు గంటలు పడుతుంది. అరిటార్ సిక్కిం సరిహద్దు లో కాంచన్ జంగ పర్వతం సరిహద్దు లో ఉంది. 1904లో ఇండో-టిబెటన్ వాణిజ్య ఒప్పందం తో అరిటార్ ప్రాచుర్యం పొందింది. అరిటార్ సంస్కృతి, సంప్రదాయం కలగలిపిన లంపోఖరి టూరిజం ఫెస్టివల్ ప్రతి సంవత్సరం ఏప్రిల్ చివరి లో లేదా మే ప్రారంభం లో అరిటార్లో నిర్వహిస్తారు. సాహసాలను ఇష్టపడే వ్యక్తులు ఈ పండుగకు బాగా ఆకర్షితులవుతారు. ఇక్కడ బోటింగ్, గుర్రపు స్వారీ, సాంప్రదాయ ఆర్చరీ పోటీ, కొండలపై చిన్న ట్రెక్కింగ్ వంటి వాటిని ఆనందించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ రాక్ క్లైంబింగ్, పారాగ్లైడింగ్‌కి చాలా క్రేజ్ ఉంది. అరిటార్ సంస్కృతి, వంటకాలు మంచి ప్రజాదరణ పొందాయి. పండుగ సమయంలో రుచికరమైన స్థానిక ఆహారంతో పాటు, నిప్పు మీద వండిన మాంసం, స్థానిక వైన్ పర్యాటకులకు వడ్డిస్తారు.
అరిటార్ లోని పర్యాటక ప్రదేశాలు పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తాయి. అందులో ముఖ్యంగా సరస్సులు ఉన్నాయి. మీరు కొండలపై ట్రెక్కింగ్ చేయాలనుకున్నా లేదా బోటింగ్‌కు వెళ్లాలనుకున్నా మీరు ప్రకృతి, సాహసాన్ని ఇష్టపడితే ఈ టూర్ ను ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ తిరుగుతున్నప్పుడు అందమైన అడవులు, పొడవైన చెట్లు, భారీ కొండలను ఆస్వాదించవచ్చు. అరిటర్ వాతావరణం ఏడాది పొడవునా సౌకర్యవంతంగా ఉంటుంది.
అరిటార్ ఎలా చేరుకోవాలి ?
అరిటార్‌ను విమాన, రైలు, రోడ్డు ద్వారా చేరుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: