లైఫ్ స్టైల్: కాళ్లకున్న ఆనెలు తగ్గాలంటే ఇలా చేస్తే సరి..?

Divya
కాళ్లకి ఆనెల సమస్య వస్తే నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. నడిచిన ప్రతిసారి తీవ్రమైన నొప్పిని కలుగజేస్తూ ఉంటాయి. ఇవి ఎక్కువగా పాదాల కింద చర్మం లో వస్తూ ఉంటాయి. అయితే వీటిని తొలగించుకోవాలంటే ఇలాంటివి చేస్తే చాలు తగ్గుతాయని కొంతమంది నిపుణులు తెలియజేస్తున్నారు.

1).నిమ్మకాయ రసాన్ని ఒక గిన్నెలో పిండుకొని, ఆ రసాన్ని ఆనెల మీద రాయడం వల్ల క్రమక్రమంగా అవి గట్టి చర్మం గా మారి రాలిపోతాయి. ఇక దీని ద్వారా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు.
2).మన వంట ఇంట్లో దొరికేటువంటి వెల్లుల్లి కూడా ఇందుకు బాగా ఉపయోగపడుతుందట. ఇక ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటం చేత వెల్లుల్లిని పేస్ట్ లా చేసి , ఆనెల మీద అ రాసినట్లయితే అవి  మంచి ఫలితాన్ని ఇస్తాయని తెలియజేస్తున్నారు కొంతమంది నిపుణులు. ముఖ్యంగా రాత్రి పడుకునే సమయాలలో ఆనెల మీద ఈ పేస్ట్ వేసి గుడ్డతో చుట్టుకోవాలి.
3). ఇక మరొకటి ఏమిటంటే , ఉల్లిపాయ రసం కూడా ఆనెలు రాకుండా నివారిస్తుందట. అది ఎలా అంటే ఉల్లిపాయలో ఉండే సల్ఫేట్ రసము ఇన్ఫెక్షన్లపై బాగా పోరాడుతుందట. ఉల్లిపాయను మొత్తం గుజ్జుగా చేసుకుని ఆనెల మీద  ఆ పేస్టుని పెట్టినట్లు అయితే ఆ రస ప్రభావం వల్ల ఆనెలు తొందరగా తగ్గే అవకాశం ఉన్నట్లు తెలియజేస్తున్నారు కొంతమంది స్పెషలిస్టులు.
4). ఇక గోరువెచ్చని నీటిలో కొంచెం సోడా పొడి ని వేసుకొని, బాగా కలిపి ఆ నీటిని పాదాల మీద కొద్దిసేపు పోసుకున్నట్లు అయితే, మీ పాదాలు పగిలిన, చీలిన పాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5). ఇక పైనాపిల్ ముక్కలను బాగా కట్ చేసి, వాటిని ఆ ఆనెల పైన ఉంచితే వాటి నుంచి విముక్తి పొందవచ్చు.

చూశారు కదా..! మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే, వెంటనే ఇప్పుడు చెప్పిన చిట్కాలను పాటించి తొందరగా ఉపశమనం పొందండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: