లైఫ్ స్టైల్: మీ ఇంటికి ఎలాంటి కలర్స్ వాడాలో తెలుసా..?

Divya
సాధారణంగా ప్రతి ఒక్కరికి సొంతిల్లు అనేది ఒక జీవితకాల కళ.ఇక దీని కోసం ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఎదురు చూస్తూ ఉంటారు. ఇక అలాంటి ఇల్లు కట్టించికోవడం కోసం ఎంతో మంది ఎన్నో రకాలుగా నిపుణులను సంప్రదించి, డిజైన్ చేయించుకుంటూ వుంటారు. ఇక పోతే ఇలాంటి ఇంటికి కలర్లు ఎంపిక అనేది కూడా చాలా ప్రాముఖ్యం వహిస్తుంది. కొంతమంది ఏ ఇంటికి ఎలాంటి రంగులు వేయాలి అని తెలిసినప్పటికీ కూడా, ధరల విషయంలో అవగాహన లేకపోవడం వల్ల ప్రజలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారు.. తక్కువ ఖర్చుతో పూర్తిచేసే రంగులను కూడా ధరల విషయంలో ఎక్కువ ఖర్చు చేస్తూ ఉంటారు.
కొంతమంది ఎటువంటి కలర్స్ ను ఏ ఏ రూమ్ లో వేయించాలో తెలియక , ఆ షాపు ఓనరు ఏ కలర్ లు ఇస్తే అవే వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇల్లు అందంగా కనిపించలేదు అంటే బాధపడుతూ ఉంటారు.. అలాంటి వారి కోసమే ఇప్పుడు సరికొత్త చిట్కాలను అందుబాటులోకి తీసుకు వచ్చాము.
ముఖ్యంగా కళ్ళకు అందంగా  కనపడడానికి  చాలా మందంగా ,బోల్డ్ గా ఉండే డిఫరెంట్ కలర్స్ ను ఇంటికి వేయించడం వల్ల , ఇల్లు చాలా అందంగా కనిపిస్తుంది. అంతేకాదు చూసే వారి మనసును ఇట్టే ఆకర్షిస్తుంది. ఇక మనిషి మైండ్ సెట్ ను కూడా మార్చే శక్తి ఇంటి కలర్ లకు ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీటి విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. నారింజ రంగు , నీలం రంగులను  వేసిన కూడా చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తాయి.. ఇక మనకు మార్కెట్లో లభ్యమయ్యే పగడపు రంగుల తో పాటు పసుపు రంగులు కూడా ఇతరులను ఆకర్షించడానికి సులువుగా ఉంటాయి. ఇక ఈ కలర్ ల వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అందుకే రంగులను మీ ఇంటికి వేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీసుకొని రంగులు చేయించుకోవడం వల్ల ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ రావడమే కాకుండా అందరిని ఆకర్షణకు గురిచేస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: