లైఫ్ స్టైల్: గులాబీ పూలను తింటే.. ఎంత లాభమో తెలుసా..?

Divya
పూలను ప్రతి ఒక్కరం ఏదో ఒక రూపం లోనూ ఉపయోగించుకుంటూనే ఉంటాము. ముఖ్యంగా మనలో చాలామంది దేవుడిని పూజించుకునేందుకు, ఆడవాళ్ళ తలలో పెట్టుకునేందుకు ఉపయోగించుకునేవారు ఎక్కువగా ఉంటారు. ప్రస్తుతం గులాబీ పూలు వల్ల మనకు చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట అవేంటో చూద్దాం.
గులాబీ పూలు ఇది ఎక్కడైనా, ఎటువంటి ప్రదేశంలోనైనా పెరగలిగే పూలమొక్క. అయితే ఈ పూలు ఎంతో సువాసనను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆడవాళ్ళ తల లో పెట్టుకుంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. ఇక ఈ పూల నుంచి వచ్చే రోజ్ వాటర్ ను మనం ప్రతిరోజు ముఖానికి పట్టించినట్లయితే ఎంతో అందంగా కనిపిస్తాము.
ఇక ఈ పూల రేకులను, తరచూ తినడం వల్ల అధిక బరువు ఉన్నవారు తగ్గుతారని కొంతమంది పరిశోధనలో తేలింది. ఈ పూలలో ఉండేటువంటి మెటబాలిజం వల్ల శరీరంలో ఉండేటువంటి భాగాలు బాగా పనిచేస్తాయి. ఈ పూల యొక్క వాసన మనసుని ఎంతో ప్రశాంతంగా ఉండేలా చేస్తుంది. ఇక మనం ఈ పూలతో స్నానం చేయాలనుకునేటప్పుడు.. వాటిని ఆ నీరు లో 20 నిమిషాలపాటు ఉంచి స్నానం చేస్తే, మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందట.
ఈ రోజా పువ్వు లో ముఖ్యంగా సి విటమిన్ పుష్కలంగా లభిస్తుంది. సి విటమిన్ వల్ల శరీర పై ఉండే చర్మ కణాలు బాగా పనిచేస్తాయి. దీంతో వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. అంతేకాకుండా కళ్ళు మంట గా ఉన్నప్పుడు, ఈ రోజా పూల రేకులను కళ్ళ మీద ఉంచినట్లయితే.. అవి తగ్గుతాయి. ఇక ఈ పూలతో తయారు చేసిన రోజ్ వాటర్ లో అనేక సూక్ష్మక్రిములతో పోరాడగలిగే గుణం ఉండడం వల్ల, ఈ నీటితో కళ్ళను తుడవడం, ముఖంపై  పెట్టడం వల్ల ఎంతో ప్రకాశవంతంగా మెరుస్తాయి.
అంతేకాకుండా మతిమరుపు సమస్య ఉన్నవారు, మైగ్రేన్ సమస్య ఉన్నవారు, ఈ పూల నుండి తయారుచేసే ఆయిల్ తో వీటికి చెక్ పెట్టవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: