సాధారణంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిని అందరికంటే భిన్నంగా నిర్మించుకోవాలని అనుకుంటూ ఉంటారు. అందులో భాగంగానే ఇంటిలోపల సరికొత్త టెక్నాలజీని ఉపయోగించి, తమ ఇంటిని ఇంద్రభవనంలా మార్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక బాగానే ఇంటి లోపల మనకు నచ్చినట్టుగా డిజైన్ చేయించుకోవడం ఒక ఎత్తయితే, ఇక బయట విషయానికి వస్తే ,అందరినీ ఆకట్టుకునేలా ఎలివేషన్ డిజైన్ చేయించుకొని ఆకర్షణీయంగా, మన ఇంటిని రూపుదిద్దుకోవడం మరో ఎత్తు. మనం ఎలివేషన్ డిజైన్ వేయించుకోవాలి అనుకున్నప్పుడు, ఇంటిని నిర్మించుకోవడానికి ప్లాన్ గీయించుకునేటప్పుడే స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ను కలిసి, మీ ఇంటికి ఎలివేషన్ తో ఎలా డిజైన్ చేయించుకుంటే బాగుంటుంది అనే సలహా తీసుకొని మరీ చేయించుకోవడం ఉత్తమం.
ఇక ఇందులో కూడా మీ ఇంటి ఫేసింగ్ ను బట్టి ఎలివేషన్ డిజైన్ చేయించుకోవడం చాలా అవసరం. ఇటీవల కాలంలో టెక్నాలజీ పెరిగిపోతున్న తరుణంలో చాలా మంది గూగుల్ సెర్చ్ చేసి, ఎలివేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అనే దానిపై అవగాహన పెంచుకుంటున్నారు .కానీ ఇలా చేయడం మంచిది కాదు అంటున్నారు స్ట్రక్చరల్ ఇంజనీర్స్. చాలా వరకు రోడ్డు ఫేసింగ్ ఎలా ఉంది..? ఎంత ఉంది ..?అనే దాన్ని బట్టి మనం ఎలివేషన్ చేయించడం చాలా అవసరం.
ముఖ్యంగా మన ఇంటికి ఎలివేషన్ డిజైన్ ఎంత బాగుంటే, మన ఇంటి ధర కూడా 25 శాతం పెరుగుతుంది అని చెప్పవచ్చు. వాస్తు ప్రకారం మీ ఇంటి డోరు తూర్పు సైడ్ ఉన్నట్లయితే , ఆగ్నేయంలో మెట్లు ఉండేలాగా చూసుకోవాలి. ఇక అందుకు తగ్గట్టుగా మీరు రెయిలింగ్ 12 ఎంఎం గ్లాస్ తో డిజైన్ చేయించుకొని, స్టీల్ ఫ్రేమింగ్ తో అందంగా చేయించుకుంటే బాగా లుక్ ఉంటుంది. ఆ తర్వాత ఎల్లో స్టోన్ తో గ్లాడింగ్ చేయించుకోవడం వల్ల , లుక్ రావడంతో పాటు దాని పైన తెల్లని రంగుతో డిజైన్ చేయడం వల్ల చాలా అందంగా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. అలాగే మీ ఇంటి ధర కూడా పెరుగుతుంది. ఇక మీరు ఇల్లు నిర్మించేటప్పుడు ఎలివేషన్ డిజైన్ పై కూడా కొంచెం శ్రద్ధ పెడితే, ఇంద్ర భవనం లాంటి ఇల్లు మీ సొంతమవుతుంది.