ఏం.. నాయనా కుల్ఫీ తినాలని ఉందా? ఇది చూడండి..

Satvika
ఒకప్పుడు చాలా మందికి  ఐస్ క్రీమ్.. అంటే విపరీతమైన పిచ్చి ఉండేది.. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారడంతో పాటుగా టేస్ట్ ను కూడా మార్చుకున్నారు. కుల్ఫీ అంటే ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు. అయితే బయట దొరికే కుల్ఫీని తింటుంటారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో అలా తీసుకోవడం అస్సలు మంచిది కాదు. అయితే మన ఇంట్లోనే ఈజీగా కుల్ఫీ ని చేసుకోవడం నేర్చుకొని ట్రై చేయడం మేలు.. ఆ కుల్ఫీకి కావలసిన పదార్థాలు, అలాగే ఎలా తయారు చేస్తారో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం..

 
కావలసిన పదార్థాలు :
2కప్పులు : బాదం (పైన పొట్టు తీసుకోని పెట్టుకోవాలి )
2కప్పులు : గడ్డ కట్టిన పాలు

1కప్పు :సాధారణ పాలు

1కప్పు :ఫ్రెష్ క్రీమ్
6 పలుకులు: పిస్తా ముక్కలు
కొద్దిగా :కుంకుమ పువ్వు
3టేబుల్ స్పూన్లు :ఉడికించిన బాదం
తయారీ విధానం :

ముందుగా పాలు, బాదం పప్పులను ఉడికించాలి. ఒక పెద్ద గిన్నె తీసుకుని పొట్టు లేని బాదం, క్రీమ్, గడ్డకట్టిన పాలు వేయాలి. చిక్కగా అయ్యే వరకు బాగా కలపి పక్కన ఉంచుకోవాలి. అపుడు, మరో పాత్ర తీసుకుని అందులో పాలు పోసి బాగా మరిగించాలి. అవి అలా మరుగుతున్నప్పుడు కుకుమపువ్వును కూడా వేసుకోవాలి. కొద్దీ సేపయ్యాక దించేయాలి. పాలు బాగా చల్లారిన తర్వాత బాదం మిశ్రమం తో కలుపుకోవాలి. అపుడు అది మంచి మిశ్రమంగా తయరవుతుంది. ఇప్పుడు మరో పాత్ర తీసుకుని పిస్తా, బాదంలని వేయించాలి. ఇపుడు వీటిని కుల్ఫీ పాత్రలో వేయాలి. కుల్ఫీ పాత్రలో మిశ్రమం సరిగ్గా కలిసేలాగా చూడాలి.. ఈ మిశ్రమాన్ని మూడు గంటలు ఫ్రీజ్ లో పెట్టాలి.. అంతే టేస్టీ.. టేస్టీ కుల్ఫీ రెడీ.. ఈ కుల్ఫీ ఉత్తరప్రదేశ్ లో బాగా ప్రాచుర్యం పొందింది. కాస్త కష్టమే కానీ కొద్దిగా టైం కేటాయిస్తే మీరు కోరుకున్న కుల్ఫీని మీ చేతులతో తయారు చేసుకోవచ్చు..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: