ప్రేమలో ఉన్నప్పుడు అలా ఫీల్ అవుతున్నారా?

Satvika
ప్రేమలో పడిన మొదట్లో చాలా మంది ఎన్నో కళలు కంటారు. ఏదేదో చేద్దామని, కొత్త ప్రపంచంలో విహరిద్దామని అనుకుంటారు. కానీ, ఇద్దరి మధ్య ఉన్న కొన్ని సమస్యల వల్ల అదికాస్త రివర్స్ అవుతుంది. మొదట్లో తియ్యగా ఉన్న ప్రేమ కొద్దీ రోజులకు చప్పగా మారుతుంది. ఈరోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకొనే వాళ్ళ కన్నా కూడా విడిపోయేవాళ్ల సంఖ్య ఎక్కువ అవుతుంది. కొన్ని కొన్ని సార్లు ప్రేమ కూడా అనవసరమైన ఒత్తిడిని తీసుకువస్తుంది. అది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరంగా మారే అవకాశమూ ఉంది.

అందుకే దాన్నుండి తొందరగా బయటపడడం చాలా ముఖ్యం. అసలు ఒత్తిడిలో ఉన్నట్లు ఎలా తెలుస్తుంది? దానికేమైనా సంకేతాలున్నాయా అనేది ఇక్కడ చూద్దాం... ప్రేమలో మొదట్లో బాగానే ఉంటుంది. కానీ మధ్యలోకి వెళ్ళినపుడు చిన్న చిన్న అలకలు, ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయలేదని ప్రశ్నించడాలు, వేరే వాళ్ళతో కొద్దిగా చనువుగా మాట్లాడినా అనుమానం మొదలగునవి వస్తుంటాయి. ఇవే మిమ్మల్ని ఒత్తిడిలోకి నెట్టేస్తాయి. మీ భాగస్వామి ఫోన్ చేస్తున్నప్పుడు మీరేం చెప్పాలా అని ఆలోచిస్తూ, ఫోన్ ఎత్తడం ఆలస్యం చేస్తున్నారంటే మీరు ఒత్తిడికి గురవుతున్నట్టే లెక్క..

చిన్న చిన్న వాటికి అలా ఫీల్ అవ్వడం, అబద్దాలు చెప్పడం, ఏడవడం, చిరాకు పడటం ఇవన్నీ కూడా మనిషిని ఒత్తిడి కి గురయ్యేలా చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఒత్తిడికి గురి చేసే కారణాలే. ఇవి మొదట్లో బాగానే ఉంటాయి. మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. పొసెసివ్ నెస్ లో భాగం అనుకుని హ్యాపీగా ఫీలవుతారు. కానీ రాను రాను ఆ పొసెసివ్ నెస్ గుదిబండలా మారి మీ మెడకు చుట్టుకుంటుంది. అందుకే వీలైనంత వరకు ప్రేమను ఆస్వాదించడానికి ప్రయత్నించాలి. తప్ప వదిలివెళ్ళిపోకూడదు. అంతకన్నా పక్కన పెట్టకూడదు.. ఒకరిపై మరొకరికి అర్థం చేసుకొనే మనస్తత్వం ఉండాలి.. అప్పుడే బంధం మరింత బలపడుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: