వేసవిలో ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు ఇవే..

Satvika
వేసవి అంటే కొత్త రుచులు రావడం తో పాటుగా మనుషులకి కొత్త ఆరోగ్య సమస్యలను కూడా తీసుకొస్తుంది. ఈ మేరకు బయటకు వెళ్ళాలన్న కూడా ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం 10 దాటితే చాలు దాహం వల్ల ఏమి తినాలో తెలియక వెళ్లిన దారిలోనే మళ్లీ ఇంటికి వస్తున్నారు. వేడి ఒకవైపు, మరో వైపు చెమట కాయలతో భాధ పడుతున్నారు. అయితే, ఇప్పుడు కొన్ని రకాల ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల కొంతవరకు వేడి నుంచి బయట పడవచ్చు నని నిపుణులు అంటున్నారు. ఇంకా ఆలస్యం ఎందుకు ఆ సూపర్ ఫుడ్స్ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..

సబ్జా గింజలు:
సబ్జా గింజలు వీటి గురించి అందరికీ తెలిసే ఉంటుంది.వేడిని తగ్గించడంలో ఇవి సూపర్ ఫుడ్స్ అని చెప్పాలి.ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని పునరుత్పత్తి చేసి వయసు పెరగడం వల్ల వచ్చే ముడతలని తగ్గిస్తుంది.

వాల్ నట్స్

యాంటీఆక్సిడెంట్లు, నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్ మూలకం ఉంటుంది. గింజల రాజుగా పిలవబడే వాల్ నట్లలో ఫైబర్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.
ఆల్ఫోన్సో మామిడి:

అధిక శాతం సి విటమిన్, ఏ విటమిన్ కలిగి ఉన్న ఆల్ఫోన్సో మామిడిలో పీచు పదార్థాలు చాలా ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో ఉండే పొటాషియం చెడుకొవ్వును తగ్గించి రక్తప్రసరణ వేగాన్ని మెరుగుపరుస్తుంది. దానివల్ల గుండె సంబంధిత ఇబ్బందులు రాకుండా ఉంటుంది..

వాల్ నట్స్
యాంటీఆక్సిడెంట్లు, నిద్రని రప్పించే ట్రిప్టోఫాన్ మూలకం ఉంటుంది. గింజల రాజుగా పిలవబడే వాల్ నట్లలో ఫైబర్, ఒమెగా కొవ్వు ఆమ్లాలు అధికంగా ఉంటాయి.

నెయ్యి:
బరువు పెరుగుతున్నారని పక్కన పెడుతున్నారు కానీ, ఇందులో విటమిన్ ఏ, విటమిన్ కే2, విటమిన్ ఈ లతో పాటూ యాంటీఆక్సిడెంట్లుగా పనిచేసే లినోలిక్ ఆమ్లాలు ఉన్నాయి. వీటివల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు జీర్ణక్రియ మెరుగవుతుంది.. అంతేకాదండోయ్ నెయ్యి తింటే మనుషులు రంగు కూడా మారతారట..
అంజీర( అత్తి పండ్లు) :

ఆపిల్, ఎండుద్రాక్షల కంతే అంజీరా చాలా మెరుగైనవి. పీచు పదార్థం ఎక్కువగా ఉన్న ఈ పండ్ల వల్ల మలబద్దకం దూరమవుతుంది. చర్మ సమస్యలు రావు. బరువు తగ్గాలనుకునేవారు వీటిని ఆహార్ంలో భాగం చేసుకోవాలి..
చూసారుగా ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. వాటివల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది.. ఇలాంటి ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: