మాంసం ఎక్కువగా తినేవాళ్ళు వీటిని తప్పకుండా తెలుసుకోవాలి..

Satvika
మాంసం తినని వాళ్ళు ఉండరేమో.. చాలా వరకు దేశం లో సగానికి పైగా మాంసాన్ని తీసుకుంటారు. కొందరు లిమిటెడ్ గా తీసుకుంటే మరి కొందరు మాత్రం అతిగా తీసుకుంటూ ఉంటారు. ఈ మధ్య కాలం లో మరీ ఎక్కువ అని చెప్పాలి.. మాంసాన్ని తీసుకుంటే కరోనా రాదని చెప్పడంతో తినేవారి సంఖ్య భారీగా పెరిగింది. అయితే, ఏది తిన్నా కూడా అది మితంగా తింటేనే మంచిది.. అలా కాదని అమితంగా తింటే ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.. c కూరగాయలు తినేవారిలో ఉండే ఆరోగ్య లక్షణాలు మాంసం తినేవారిలో ఉండవట. ఈ మేరకు పరిశోధన్లు జరిపిన పోషకాహార నిపుణులు, మాంసం ఎక్కువగా తినడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు.

మాంసాహారాన్ని ఇష్టపడేవారు మరీ ఎక్కువగా తినడం వల్ల అనేక రోగాల బారిన పడే అవకాశం ఉన్నట్లు కనుక్కున్నారు.మాంసంలో విటమిన్ ఏ, విటమిన్ డి, ప్రోటీన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీర బరువును విపరీతంగా పెంచుతాయి. దానివల్ల అనేక సమస్యలు వచ్చే ఛాన్స్ ఉంది. అందుకే గుండె జబ్బులు, మధుమేహం మొదలగు వ్యాధులన్నీ బరువు పెరగడం వల్ల పుట్టుకొస్తున్నాయి.. బరువును తగ్గించుకొని అదుపు లో పెట్టుకోవాలని భావించేవారు వీటిని కొంతవరకు తగ్గిస్తే మేలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ మేరకు మాంసాన్ని వారానికి రెండు, మూడు సార్లు తీసుకోవాలి. ప్రాసెస్ చేసిన మాంసం తినడం వల్ల గుండెజబ్బులు పెరుగుతున్నాయని వెల్లడైంది. మాంసాహారం తినని వారిలో గుండెజబ్బులు వచ్చే శాతం 30గా ఉంటే మాంసాహారం ఎక్కువగా తినేవారిలో ఇది 15శాతం ఎక్కువగా ఉంది. మాంసం జీర్ణం కావాలంటే దాదాపు 17 గంటల సమయం తీసుకుంటుంది. అందుకే రోజు తీసుకోవడం వల్ల జీర్ణ  సమస్యలు తలెత్తుతాయి. దాంతో ఆరోగ్యం పాడవుతుంది.. అందుకే మాంసం తినాలి.. కానీ మితంగా తీసుకుంటే చాలా మంచిది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: