జీవిత సత్యాలు: ఈ రెండూ లేని జీవితం శుద్ధ దండుగ. మీ జీవితంలో ఇవి ఉన్నాయా..?

మానవ జీవితం ఓ అద్భుతం.. ఈ భూమి మీద ఆలోచించగలిగిన ప్రాణి మనిషి ఒక్కడే. మరి అలాంటి మానవ జన్మను సార్థకం చేసుకోకుండా..అనేక అపోహలతో పిచ్చి పనులతో వృథా చేసుకునే వాళ్లే చాలా మంది కనిపిస్తున్నారు.

చాలా అదృష్టం చేసుకుంటే వచ్చి మానవ జన్మను కూడా నిరాసక్తంగా గడిపేస్తుంటారు చాలా మంది. మనిషి జీవితంలో స్వేచ్ఛ, చైతన్యం.. ఈ రెండూ లేకపోతే.. మనం మానవ జన్మ ఎత్తి కూడా వృథానే. ప్రతి జీవీ స్వేచ్ఛ కోరుకుంటుంది. అది పుట్టుకతో వచ్చే సహజ లక్షణం.

ఇక చైతన్యం అంటారా.. ఈ చైత్యం మౌలిక స్వభావమే స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ నుంచే జ్ఞానం ఆవిష్కృతమవుతుంది. స్వేచ్ఛ లేని చోట జ్ఞానం మనుగడ సాధించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే చైతన్యం, స్వేచ్ఛలు ఒకే నాణేనికి బొమ్మా బొరుసువంటివి.

బొమ్మా బొరుసుల్లో ఏ ఒక్కటి లేకపోయినా నాణెం చెల్లదు. అదేరీతిన చైతన్యం, స్వేచ్ఛల్లో ఏది తగ్గినా చేపట్టిన పని అసంపూర్ణమై వృథా అవుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో అమూల్యమైన ఈ రెండూ ఉన్నాయో లేదో చూసుకోవాలి. లోపం తలెత్తితే దిద్దుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: