వండర్ : ఆస్కార్ అవార్డ్ రేంజ్‌లో నటిస్తున్న పాము.. దేవుడు వీటికి ఎన్ని తెలివితేటలు ఇచ్చాడో..?

ఈ ఫోటో చూశారా.. అరెరే.. ఈ పాము చచ్చిపోయిందే అనిపిస్తుంది కదా.. పాపం.. ఎలా చనిపోయిందో ఏంటో అని కూడా అనిపిస్తుంది. ఆ పాము కుళ్లిపోతున్నట్టు వాసన. కొంత రక్తం కూడా అక్కడ ఉంటుంది.. కానీ ఇది ఆస్కార్ అవార్డ్ రేంజ్ లో నటిస్తుందన్న విషయం గుర్తుపట్టడం కష్టం. మరి ఎందుకీ నటన అంటారా.. పాపం పొట్ట కోసం తిప్పలు పడుతోందీ పాము.

అవును.. ఈ విద్యలన్నీ పొట్ట తిప్పల కోసమే. దీని వేషాల సంగతి తెలియక.. ఎలుకల్లాంటి కొన్ని జంతువులు.. దగ్గరకు వచ్చేస్తాయి. పాముకు ఆహారం అవుతాయి. మరి ఇది ఎలా నటిస్తుంది.. శరీరాన్ని తిప్పడం సరే. మరి దుర్వాసన, రక్తపు చుక్కలు ఎలా వచ్చాయం టారా? ఈ పాముల నోట్లో ఉన్న ప్రత్యేక గ్రంథులే అందుకు కారణం.

ఈ జాతి పాములతో పాటు వెస్ట్ ఇండి యన్ వుడ్ పాములూ ఇలానే చేస్తుంటాయట. ఇంతకూ దీని పేరు చెప్పలేదు కదూ. దీని పేరు హాగ్ నోస్. పొట్టనింపుకోవడానికి ఇది వేసే వేషాలు భలే నవ్వు తెప్పిస్తాయి. మరి కూటి కోసం కోటి తిప్పలు అని ఊరికే అన్నారా.?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: