గర్భవతులు ప్రాసెస్డ్ ఫుడ్ తింటే పుట్టే పిల్లలకు ఆటిజం వచ్చే ప్రమాదం

గర్భవతుల ఆరోగ్యం గురించి అంతా చాలా శ్రద్ధ వహిస్తారు. వారిని కాలు కదపనీయకుండా చూసుకుంటారు. బిడ్డ ఆరోగ్యంగా జన్మించాలని గర్భవతులకు పౌష్టికాహారం ఇస్తుంటారు. అయితే బలవర్థకమైన ఆహారం ఇచ్చే క్రమంలో చేసే పొరపాట్లు.. పుట్టే బిడ్డపై చాలా ప్రభావం చూపుతున్నాయి.


కాబోయే తల్లులకు సహజమైన ఆహారం కాకుండా ప్రాసెస్ చేసిన ఆహారం ఇవ్వడం వల్ల పుట్టే పిల్లల్లో ఆటిజం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు యూనివర్సిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా పరిశోధనల్లో వెల్లడైంది. ఎందుకంటే ప్రాసెస్ చేసిన ఆహారంలో ప్రోప్రయానిక్ ఆమ్లం ఉంటుంది.


ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు కలిపే రసాయనాల్లో ఈ ప్రొప్రయానిక్ ఉంటుంది. అలాంటి ప్రాసెస్ చేసిన ఆహారం తీసుకోవడం వల్ల తల్లి ద్వారా ఈ ప్రోప్రయానిక్ ఆమ్లం బిడ్డను చేరుతుంది. ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న ఆ శిశువు నరాల వ్యవస్థపై దుష్ప్రభావం చూపుతుంది.


ఆటిజంతో బాధపడుతున్న కొందరు పిల్లల మల విసర్జన శాంపిళ్లను పరిశీలిస్తే.. వాటిలో ఈ ప్రోప్రయానిక్ ఆమ్లం స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఈ అంశంపై పరిశోధన చేస్తున్న డాక్టర్ నాసర్ తెలిపారు. ఈ అంశంపై మరింత విస్తృతంగా పరిశోధన చేసి ఆటిజం మూల కారణాలను కనుక్కునేందుకు యూనివర్శిటీ ఆఫ్ సెంట్రల్ ఫ్లోరిడా కృషి చేస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: