వీటిని తింటే చాలు కిడ్నీ ఆరోగ్యంగా ఉంటుంది !

Seetha Sailaja
మనశరీరంలో మూత్రపిండాలు పోషించే పాత్ర చాలా ముఖ్యమైనది. మన శరీరంలోని  ఎప్పటికప్పుడు పేరుకుపోయే వ్యర్థాలను తొలగించడంలో కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోతే మన శరీర ఆరోగ్యం పూర్తిగా పాడైపోతుంది. అయితే ప్రస్తుతం రకరకాల అలవాట్లు వలన లేదంటే మారిన జీవనసరళి వల్ల అనేకమంది కిడ్నీ వ్యాధుల బారిన పడుతూ అనేక సమస్యలు ఎదుర్కుంటున్నారు. అయితే మనం రోజు తీసుకునే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా మనం ఈ కిడ్నీల సమస్య నుండి బయటపడవచ్చని లేటెస్ట్ అధ్యయనాలు చెపుతున్నాయి. 

ఇప్పుడు ఆవిషయాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతిరోజు 7 నుంచి 8 గ్లాసుల నీటిని కచ్చితంగా తీసుకునే వారికి కిడ్నీలు సాధారణంగా ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు చెపుతున్నారు. అదేవిధంగా ఎరుపు రంగులో ఉండే క్యాప్సికంను తరచూ తినేవారికి వీటిల్లో ఉండే విటమిన్ ఎ, సి, పొటాషియం తదితర పోషకాలు వల్ల కిడ్నీల ఆరోగ్యం చాలబాగుంటుంది. అదేవిధంగా నిత్యం వెల్లుల్లిని ఏదో ఒక రూపంలో తీసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయని ఆయుర్వేద వైద్యులు చెపుతున్నారు. వెల్లుల్లి వల్ల మన శరీరంలో ఉండే విషపదార్ధాలు బయటకు వెళ్ళిపోతాయి.

ఇక ముఖ్యంగా రోజుకో యాపిల్ పండును తింటే కిడ్నీలను ఆరోగ్యంగా ఉంటాయని డైటీషియన్స్ కూడ చెపుతున్నారు. యాపిల్ పండ్లలో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. అంతేకాకుండా పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి, డి లు కిడ్నీ వ్యాధులు రాకుండా చూడడంతోపాటు కిడ్నీలను సంరక్షిస్తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకుంటే కిడ్నీలు ఆరోగ్యంగా ఉంటాయి అని అనేక పరిశోధనలు తెలియచేస్తున్నాయి. 

స్ట్రాబెర్రీలలో ఫైబర్, విటమిన్లు, ఇతర పోషకాలు పుష్కలంగా ఉన్న నేపధ్యంలో వీటిని తరుచూ తీసుకోవడం కూడ మంచిది అని అంటున్నారు. ఇవే కాకుండా ఓట్స్, కాలిఫ్లవర్, ఉల్లిపాయలు, పైనాపిల్స్ కూడా కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగు పరచడంలో సహకరించి కిడ్నీ వ్యాధులు రాకుండా చూస్తాయి. ఈ ఆహారపు పదార్ధాలను తినడం అలవాటుగా చేసుకుంటే ఎంతోకొంత కిడ్నీల సమస్యల నుండి తప్పించుకునే అవకాసం ఉందని వైద్యులు కూడ అంగీకరిస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: