చలికాలంలో మీ పిల్లలు తరచూ జ్వరంతో బాధపడుతూ ఉన్నారా..!అయితే ఇలా చేసి చూడండి..

Divya
ఈ సీజన్ మార్పు వల్ల చిన్న పెద్ద తేడా లేకుండా ఎక్కువగా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లకు గురవుతూ ఉన్నారు. వీటి కోసం ఇంగ్లీష్ మందులు వాడి,కొద్ది రోజులు కోలుకున్నా, మళ్లీ తిరిగి వస్తూ ఉంటుంది. దీనికి కారణం పిల్లల్లో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడమే అంటున్నారు వైద్య నిపుణులు. వారిలో రోగనిరోధకశక్తి పెంచడానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..
సాధారణంగా రోగనిరోధకశక్తిని మన శరీరమే మనకి ఉత్పత్తి చేస్తుంది.అంతే కాక మనం తీసుకునే ఆహారాలు కూడా కొద్ది మొత్తంలో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. తరచూ పిల్లలు జ్వరంతో బాధపడేవారికి ఒకటి రెండు రోజులు ఎలాంటి ఆహారాలు ఇవ్వకపోవడమే చాలా మంచిది. ఆ సమయంలో పిల్లలు నీరసపడిపోతారని బెంగ ఉన్నవారు,గోరువెచ్చని నీటిలో, తేనె కలిపి రోజుకి ఐదు ఆరు సార్లు పట్టించడం చాలా ఉత్తమం.దీనివల్ల మన జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి,రోగనిరోధకశక్తిని పెంచుతుంది. ఇందులో వాడే తేనేలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు జ్వరాలు, దగ్గు,జలుబులు వంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ రాకుండా పిల్లల శరీరలను కాపాడుతుంది.
కొంచెం పెద్ద పిల్లలు అయితే తిప్పతీగ కషాయం బాగా సహాయపడుతుంది. దీనికోసం రెండూ లేదా మూడు తిప్ప తీగ ఆకులను తీసుకొని,గిన్నెలో వేసి, రెండు గ్లాసుల నీళ్ళు పోసి బాగా మరిగించాలి. ఆ నీళ్ళు ఒక గ్లాస్ అయిన తర్వాత దించి, చల్లార్చి గోరువెచ్చగా ఉన్నప్పుడే, ఒక టేబుల్ స్ఫూన్ తేనే కలిపి, తాగించాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేయడం వల్ల, వాళ్ళ ఇమ్యూనిటీ పెరిగి, జ్వరం తొందరగా తగ్గుతుంది.
జ్వరం తగ్గిన ఒకటి రెండు రోజుల తర్వాత సులభంగా జీర్ణమయ్యే పళ్ళ రసాలను ఇవ్వాలి. ముఖ్యంగా దానిమ్మ, ఆరెంజ్, యాపిల్ వంటి పళ్ళను ఇవ్వడం వల్ల, ఇందులో వున్న విటమిన్ సి రోగనిరోధకశక్తిని పెంచుతాయి.అన్నం తినే పిల్లలకు రసం, ఆకుకూరలతో కలిపి వండిన పప్పు వంటివి పెట్టాలి. ఇవి తొందరగా జీర్ణం అయి, నీరసం, నిస్సత్తువను తగ్గిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: