మలబద్ధకంతో బాధపడేవారు ఇవి తినడం మానేయండి?

Purushottham Vinay
చాలా మంది కూడా మల బద్ధకం సమస్యతో ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయినా కానీ ఈ సమస్యని చాలా మంది లైట్ తీసుకుంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదు. మల బద్ధకం సమస్య వల్ల ఖచ్చితంగా చాలా రోగాలు వస్తాయి. ఒక్కోసారి ప్రాణాపాయం కూడా కలగవచ్చు.కాబట్టి ఈ సమస్యని తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా తీసుకునే ఆహారం విషయంలో కూడా తగిన జాగ్రత్తలు పాటించాలి. లేదంటే చాలా ప్రమాదం.కొన్ని ఆహారాలను తగ్గిస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థకు ఇబ్బంది కలిగించే కొన్ని ఆహారాలను తగ్గించడం వల్ల ఖచ్చితంగా కొంత మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మలబద్ధకం ఉన్న వారు తినకూడని ఆ ఆహారాలేంటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం.మలబద్ధకం సమస్య ఉన్న వారు వీలైనంతగా ఫాస్ట్ ఫుడ్స్ లేదా జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉంటే మేలని వైద్యులు సూచిస్తున్నారు.


ఎందుకంటే వీటిల్లో చాలా ఎక్కువగా వాడే ఉప్పు లేదా చక్కెర మలబద్దకాన్ని చాలా తీవ్రం చేస్తుంది. ఈ ఫాస్ట్ ఫుడ్స్ లో శరీరానికి అవసరమయ్యే ఫైబర్ అంత ఎక్కువ ఉండదు. దీంతో అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇంకా ఫాస్ట్ ఫుడ్స్ తీసుకుంటే మధుమేహం లాంటి ఇతర సమస్యల బారిన కూడా పడే అవకాశం ఉంది.అలాగే మనం పాలు లేదా పాల ఉత్పత్తులను తీసుకున్నప్పుడు అవి జీర్ణం అవ్వడానికి లాక్టేజ్ అనే ఎంజైమ్ చాలా అవసరం. ఈ మలబద్ధక సమస్యతో బాధపడేవారికి లాక్టేజ్ ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. కాబట్టి మలబద్ధకం సమస్యతో బాధ పడే వారు పాల ఉత్పత్తులను అస్సలు తీసుకోకూడదు.సాధారణంగా అరటి పండ్లు జీర్ణ క్రియకు చాలా మేలు చేస్తాయి. కానీ పచ్చి అరటి పండు మాత్రం మలబద్దక సమస్యను ఎక్కువగా పెంచుతుంది. పచ్చి అరటి పండ్లల్లో చాలా ఎక్కువగా స్టార్చ్ ఉండడం వల్ల జీర్ణం కావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి వీలైనంతగా పచ్చి అరటిపండ్లను తినకుండా ఉంటే మంచిది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: