జీలకర్ర ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా?

Purushottham Vinay
జీలకర్ర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎన్నో ఔషధ గుణాలను కలిగి ఉంటుందని మనందరికి తెలుసు.జీలకర్ర ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది. జీలకర్ర చెట్టు సుమారు 30 నుండి 50 సెంటిమీటర్ల ఎత్తు పెరుగుతుంది. జీలకర్రను వంటల్లోనూ, ఔషధంగా కూడా ఉపయోగిస్తారు.జీలకర్ర వాడితే చర్మ వ్యాధులు ఈజీగా తగ్గుతాయని తాజా పరిశోధనల్లో తేలింది. అలర్జీలను నయం చేయడంలో కూడా జీలకర్ర ఉపయోగపడుతుంది. అదే విధంగా జీలకర్రను వేయించి పొడిగా చేయాలి. ఈ పొడికి సైంధవ లవణాన్ని లేదా ఉప్పును కలిపి రోజుకు రెండు పూటలా తీసుకోవడం వల్ల స్త్రీలల్లో గర్భాశయ బాధలు నెమ్మదిస్తాయి. ఈ పొడిని నీటిలో లేదా మజ్జిగలో కలిపి తీసుకోవాలి. అదేవిధంగా జీలకర్రను వేయించి పొడిగా చేయాలి. తరువాత అందుకు సమానంగా వేయించని జీలకర్రను పొడిగా చేసి కలపాలి. 


తరువాత దీనికి చక్కెరను, ఆవు నెయ్యిని కలిపి కుంకుడు గింజంత పరిమాణంలో మాత్రలుగా చేసుకోవాలి.ఈ మాత్రలను రోజుకు రెండు పూటలా రెండు చొప్పున వేసుకోవాలి. దీని వల్ల మూత్ర సంబంధిత వ్యాధులు, మూత్రంలో వేడి, మూత్రంలో మంట, పచ్చదనం వంటివి తగ్గుతాయి. కడుపులో నులి పురుగులను నివారించడంలో జీలకర్ర దివ్యౌషధంగా పని చేస్తుంది. మజ్జిగలో ఇంగువను, జీలకర్రను, సైంధవ లవణాన్ని కలిపి తీసుకుంటే పొట్ట ఉబ్బరం తగ్గుతుంది. జీలకర్రతో కషాయాన్ని చేసుకుని తాగడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉంటాయి. బీపీ, షుగర్ వంటి వ్యాధులు నియంత్రణలో ఉంటాయి. శరీరం పై వచ్చే తామర, తెల్ల మచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఇటువంటి చర్మ వ్యాధులను గుర్తించి వాటి బారి నుండి బయట పడడం చాలా అవసరం.జీలకర్రను నిమ్మరసంతో కలిపి సూర్యోదయ సమయాన, సూర్యాస్తమయ సమయాన రెండు పూటలా తింటే తల తిరగడం, కడుపులో వేడి వంటి మొదలగు పైత్య రోగాలు తగ్గుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: