రసికులే: అందులో హైదరాబాదీలు దేశంలోనే నెంబర్‌ 1 ?

స్మార్ట్ ఫోన్‌ చేతిలోకి వచ్చాక.. మనిషి జీవితమే మారిపోయింది. ఎక్కడో దూరంగా ఉన్న వాళ్లు సైతం దగ్గరైపోతున్నారు. పక్కనే ఉన్న ఆత్మీయులతో పలకరింపే కరువవుతోంది. ఇక స్మార్ట్‌ ఫోన్‌ రాకతో అనేక దుర్లక్షణాలు కూడా అలవడుతున్నాయి. వాటిలో డేటింగ్ కూడా ఒకటి.. డేటింగ్‌ పేరుతో సాగే అక్రమ సంబంధాలు క్రమంగా పెరిగిపోతున్నాయి. విశేషం ఏంటంటే.. ఈ వీడియో డేటింగ్‌లలో మన హైదరాబాద్ దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందట. ఈ విషయం ఓ  ఆన్‌లైన్‌ డేటింగ్‌ సంస్థ నిర్వహించిన ఇయన్‌ ఇన్‌ స్వైప్‌-2021 సర్వేలో బయటపడింది.

ఇక ఈ వీడియో డేటింగ్‌లో హైదరాబాద్ తర్వాత చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణె వంటి నగరాలు ఉన్నాయట. ఈ సర్వే ఎలా నిర్వహించారంటే.. జనవరి 1 నుంచి నవంబరు 30 వరకు 18 నుంచి 25 ఏళ్ల వయసున్న వారి నుంచి డేటా తీసుకుని క్రోడీకరించి ఈ ఫలితాలు రూపొందించారట. ఇక డేటింగ్‌లో లెటేస్ట్ ట్రెండ్‌ అయిన పిక్‌నిక్‌ ఇన్‌ ఎ పార్క్‌, వర్చువల్‌ మూవీ నైట్‌, సైక్లింగ్‌, పొట్టెరీ అనే అంశాలపై ఇప్పుడు యూత్ బాగా ఇంట్రస్ట్‌ గా ఉన్నారట. ఈ  వీడియో కాల్‌ ప్రక్రియలో 52 శాతం వృద్ధి నమోదయిందట.

ఇదే సమయంలో ఈ డేటింగ్‌ యాప్‌ల ముసుగులో అనేక అక్రమాలు, మోసాలు కూడా చోటు చేసుకుంటున్నాయి.  ఈ డేటింగ్‌ యాప్‌ల ద్వారా జరుగుతున్న మోసాల్లో 33 శాతం క్యాట్‌ ఫిషింగ్‌ ద్వారా జరుగుతున్నాయట. మరో 38 శాతం మోసాలు హానికరమైన లింక్‌లు లేదా అటాచ్‌మెంట్లు ద్వారా జరుగుతున్నాయట. ఇంకో 36 శాతం మంది తమ ఫోన్లలో డేటా చోరీ అయినట్టు గుర్తించారట. ముంబయి, బెంగళూరు, హైదరాబాద్‌, చెన్నై, నోయిడా వంటి  నగరాల్లో ఈ డేటింగ్ యాప్‌లో సబ్‌స్క్రిప్షన్‌ చాలా వేగంగా పెరుగుతోందట. వారం వ్యవధిలోనే మూడు రెట్లు ఈ డేటింగ్ యాప్‌ల పట్ల ఆకర్షితులవుతున్నారట.

అయితే.. ఈ డేటింగ్ యాప్‌లు చూసేందుకు బాగానే ఉంటాయి. కానీ ఈ యాప్‌లు ఇన్‌ స్టాల్‌ చేసుకున్నప్పుడు మనం ఇచ్చే పర్మిషన్లు చాలా సార్లు కొంపలు ముంచుతుంటాయి. మన అకౌంట్లు ఖాళీ చేస్తుంటాయి. తస్మాత్‌ జాగ్రత్త గురూ..!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: