బాల భారతం: ఆరింద పేరక్కలు ఎక్కువైపోయారు?

praveen
నాటి రోజుల్లో పిల్లలకు నేటి రోజుల్లో పిల్లలకు చాలా తేడా ఉంది.. అదేంటోగాని నేటి రోజుల్లో పిల్లలు వస్తున్న మార్పు.. కాస్త మంచిదే అయినప్పటికీ.. విలువలు మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.. అదేంటి నాటి రోజుల్లో పిల్లలతో పోల్చి చూస్తే ఈ రోజుల్లో పిల్లలు చాలా షార్ప్ గా ఉన్నారు.. చిన్న ఈ వయసులోనే అద్భుతమైన టాలెంట్ సత్తా చాటుతున్నారు.. అని అంటారా.. టాలెంట్ ఉండడం వరకు ఓకే.. ఇక నేటి రోజుల్లో పిల్లలు సత్తా చాటడం  అంటే అది చాలా మంచిది.. కానీ మానవతా విలువలు మాత్రం నేటి రోజుల్లో పిల్లల్లో ఎక్కడా కనిపించడం లేదు. ఒకప్పుడు కాలేజీ రోజుల్లో కూడా ఇంకా తల్లిదండ్రుల చాటు బిడ్డ లాగానే పెరిగే వాళ్ళు అందరు.. పెద్దలు అంటే ఎనలేని గౌరవం.. పెద్దలతో ఏం మాట్లాడాలన్నా ఆచితూచి మాట్లాడేవారు.. ఒక్క మాటలో చెప్పాలి అంటే పెద్దలు చెప్పిన దానికి ఎదురు చెప్పడం చాలా తక్కువ.

 కానీ నేటి రోజుల్లో పిల్లలు ఇలాంటివి ఎక్కడ కనిపిస్తున్నాయి.. కాస్త ఏజ్ పెరిగింది అంటే చాలు ఇక మేమే తోపు మా కంటే ఎవరు గ్రేట్ కాదు అని భావిస్తున్నారు.. కనీసం పెద్దలకు ఎలా గౌరవం ఇవ్వాలి అన్న విషయం కూడా నేటి రోజుల్లో పిల్లలకు తెలియడం లేదు.. అయితే పెద్దలకు గౌరవం ఇవ్వాలని తల్లిదండ్రులు ఎంత చెబుతున్నా.. మారుతున్న కాలం ప్రభావమో.. ఈ సమాజం ప్రభావమో.. జనరేషన్ గ్యాపో తెలియడం లేదు కానీ.. నేటి రోజుల్లో పిల్లలు ఆరింద పేరక్కల లాగ ప్రవర్తిస్తున్నారు.


 తెలిసి తెలియని వయసులోనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. ఇలా పిల్లలు మాట్లాడే మాటలు పెద్దల మనసును గాయపరిస్తూనే ఉన్నాయి.. అసలు పెద్దలకు గౌరవం ఎలా ఇవ్వాలి..  పెద్దల దగ్గర ఎలా అనిగిమనిగి మాట్లాడాలి.. ఎలా అనుకువ ఉండాలి.. ముఖ్యంగా పెద్దలతో ఎలా ప్రవర్తించాలిఅన్న విషయం నేటి రోజుల్లో పిల్లలుఎక్కడా కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలి అంటే నేటి జనరేషన్ పిల్లలు.. పెద్దలను కాస్త చులకనగా చూస్తున్నారు అని చెప్పాలి. ఇక చిన్న వయసులో చిన్న పిల్లల పెద్ద పెద్ద మాటలు విని అవ్వాక్కవాల్సిన    పరిస్థితి అటు తల్లిదండ్రులది బంధువులది అయింది నేటి రోజుల్లో.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: