బుడుగు: చిన్నపిల్లలు తినకూడని పదార్థాలివే..!

N.ANJI

ప్రస్తుతం జీవన విధానం మారింది. మారుతున్న కాలాన్ని బట్టి మనిషి తన ఆహారపు అలవాట్లను మార్చుకుంటూ వస్తున్నాడు. నోటికి నచ్చిన ఆహారాన్ని భుజిస్తూ ఆనందంగా జీవిస్తున్నాడు. పౌష్టికాహారాలను పక్కన పెట్టి జంక్ ఫుడ్స్‌కు ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. ఇంట్లో ఈ అలవాటు ఒక్కరికి ఉన్నా చాలు.. ఇంటి మొత్తానికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు జంక్ ఫుడ్స్‌పై మక్కువ ఎక్కువగా ఉంటుంది.  


ప్రస్తుత తరుణంలో తల్లిదండ్రులు తమ పిల్లలకు పౌష్టికాహారాన్ని అందించలేకపోతున్నారు. ఆరోగ్యకరమైన ఆహారం పేరుతో ప్రాసెస్ చేసిన ఆహారాన్ని అందిస్తున్నారు. దీంతో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. తరచూ పిల్లలకు ఇదే ఆహారం ఇవ్వడం వల్ల ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్‌లో కొన్ని ఆహార పదార్థాలు పిల్లలకు హెల్తీగా ఉంటాయని ప్రచారం జరుగుతోంది. కానీ అవి చిన్నారులకు ఎంతో హానికరంగా మారవచ్చని నిపుణులు చెబుతున్నారు.


మార్కెట్‌లో ప్రస్తుతం ఎన్నో రకాల చాక్లెట్లు అందుబాటులో ఉన్నాయి. పాల మిశ్రమంతో కలిగిన చాక్లెట్లు, చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న చాక్లెట్లు ఇలా చాలా రకాల చాక్లెట్లు మార్కెట్‌లో ఉంటాయి. అయితే వీటిలో ఎక్కువగా షుగర్ లెవల్స్ ఉండే ప్రమాదం. వీటికి బదులు చిన్నపిల్లలకు డార్క్ చాక్లెట్లు తినిపించాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే నూనెలో వేయించిన చిప్స్ తినడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు. వీటిలో ఎక్కువ క్యాలరీలు, ఫ్యాట్, ఉప్పు అధికంగా ఉంటుంది. వీటికి బదులు ఉడకబెట్టిన చిలకడదుంపలు, పాప్ కార్న్, ఇతర స్నాక్స్ ఇవ్వడం మంచిది.   


టమాటా సాస్‌లు, స్వీట్స్, చక్కెరతో తయారు చేసిన పదార్థాలు, నూనెలో వేయించిన పదార్థాల నుంచి పిల్లలను దూరంగా ఉంచాలి. జంక్ ఫుడ్స్‌ నుంచి పూర్తిగా అవాయిడ్ చేయించాలి. వీటిని అధికంగా తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది. అందుకే ఫ్రూట్స్, సలాడ్స్, సాఫ్ట్ డింక్స్, స్పోర్ట్స్ డ్రింక్ వంటి జ్యూస్‌లు అందజేయాలి. వీటిలో షుగర్ లెవల్స్ తక్కువగా ఉంటుంది. వీటిని పిల్లలకు ఇవ్వడం వల్ల వీరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే ఫ్రూట్ జ్యూసులు తాగించాలి. వీటితో కొబ్బరి బొండాలు కూడా తీసుకోవచ్చు. వీటిలో అన్ని రకాల పౌషకాలు పిల్లలకు అందుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: