బుడుగు: పుట్టిన పిల్లలకు ఎలాంటి గాజులు వేస్తే మంచిది..??

N.ANJI
హిందూ సంప్రదాయం ప్రకారం మహిళలు గాజులను సౌభాగ్యంగా భావిస్తుంటారు. ఇక అమ్మాయిలు కనీసం రెండు మట్టి గాజులైనా వేసుకోవాలని పెద్దవారు చెబుతుంటారు. ఇక అప్పుడే పుట్టిన పిల్లలకు కొన్ని ప్రత్యేకమైన గాజులనే వేస్తుంటారు. అయితే ఎందుకు అలా కొన్నిరకాల గాజులే వారికి దిష్టి తగలకుండా కాపాడుతాయని పెద్దవారి చెబుతుంటారు. ఇక ఇంతకీ ఏంటా గాజులు.. ఏ రంగులో ఉంటాయో ఒక్కసారి చూద్దామా.
సాధారణంగా గాజులు వేసుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని హిందూ సంప్రదాయం చెపుతుంది. ఇక అప్పుడే పుట్టిన పిల్లలకు నల్లగాజులు వేయడం వల్ల దోషాలు, దిష్టి తగలకుండా రక్షణగా ఉంటాయని పెద్దలు చెబుతున్నారు. అంతేకాక.. పిల్లలకు గాజుల శబ్ధం ఆనందంతో.. సంతోషాన్ని కలిగిస్తాయని చెబుతున్నారు. ఇక ఇప్పటి తరం అమ్మాయిలు మట్టి గాజులు వేసుకునేందుకు ఎక్కువగా ఇష్టపడటం లేదంట. అయితే లేటెస్ట్ ఫ్యాషన్ అంటూ ప్లాస్టిక్ గాజులు ఇతర రకాల గాజులను వేసుకునేందుకు ఆసక్తి చూపిస్తూ ఉన్నారు. కాగా.. మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో వేడిని అది లాగే అవసరమైన శాస్త్రాలు చెపుతున్నాయి.
పూర్వకాలంలో మహిళలు గాజులు వేసుకోవడం వెనుక కూడా ఓ రహస్యం ఉండేదంట. అయితే పూర్వకాలంలో మగవారు మాత్రమే రోజూ బయటకు వెళ్లి బాగా కష్టపడి పని చేసేవారంట. ఇక మహిళలు ఇంటికే పరిమితమయ్యే వారంట. ఇక వారి కోసం గాజులు చేశారని చెప్పుకొస్తూ ఉంటారు. అంతేకాదు.. ఆడవారు గాజులను ధరించడం వల్ల అవి ఎపుడూ చేతి నరాలను తాకుతూ ఉండటం వల్ల బీపీ కంట్రోల్‌గా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గాజులు ధరించడం వలన అనారోగ్య సమస్యలు దరిచేరవని నమ్ముతుంటారు
ఇక ముఖ్యంగా ఆడవారి నుంచి నెగెటివ్ ఎనర్జీ పుట్టకుండా చేస్తాయని అన్నారు. అలాగే ఆడవారు మెట్టెలు ధరించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి గుండె నుంచి గర్భాశయానికి రక్త ప్రసరణ చేయడం మంచిగా జరిగేలా చూస్తుందంట. అయితే దానివల్ల ఆడవారిలో రుతుక్రమం సరిగా అవుతుందని పూర్వకాలంలో అభిప్రాయ పడుతూ ఉండేవారంట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: