ఈ కాలం పిల్లలకు ఎలాంటి ఆహారం ఇస్తే మంచిది?

N.ANJI
ఈ కాలం పిల్లలకు స్కూల్లో చదువుతో పాటు చాలా యాక్టివిటీస్ చేయిస్తున్నారు. క్రీడలు, ట్యూషన్స్ తో పాటు ఇంకా రకరాలవాటిల్లో ప్రావిణ్యం పొందటానికి టీచర్స్ పిల్లలను తెగ రుద్దేస్తుంటారు. వాటిని వారిలో ఉన్న శక్తి అంతా పోతుంది. పోషకాహార నిపుణులు డాక్టర్ గీతా ధర్మట్టి పిల్లలకు కావల్సిన ఫుడ్ డైట్ గురించి వివరించారు.
బ్రెడ్స్ అంటే పిల్లకు చాలా ఇష్టం.. వాటితో ఏం వేరైటీలు చేసినా ఇష్టంగా తింటారు.  పాలు పాలతో చేసిన పదార్థాలు పిల్లలకు ఇవ్వాలి. రోజు గుడ్డు తినిపించాలి. రోజూ పెరుగు కూడా పెట్టాలి. చీజ్, పనీర్, పండ్లు, కూరగాయలు తరచూ ఇస్తూ ఉండాలి. సీజన్ ను బట్టి దొరికే ఏ ఫ్రూట్స్ అయినా పిల్లలకు ఇవ్వొచ్చు.
 
 పిల్లకు ఆరోగ్యానికి మంచిది కదా అని మనం ఏం పెడితే అది వాళ్లు తినరు. చూడ్డానికి కలర్ ఫుల్ గానూ టేస్టీగానూ ఉండాలి. మిల్క్ షేక్ , పాల్లో కార్న్ ఫ్లేక్స్ కానీ ఓట్స్ కానీ కలిపి ఇస్తే ఇష్టంగా తాగుతారు. అటుకులను కూరగాయాల్లో కలిపి పెడితే  మరీ మంచిది. వీటిని తినమంటే మొదట కాస్త పిల్లలు మోఖం చాటేస్తారు.. కానీ మనమే వాటని వారీ డైలీరోటీన్ లో భాగం చేయాలి.
   .
పిల్లలు రోజులో నాలుగు సార్లు ఫుల్ మీల్స్ తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతుంది. చపాతీలు, పరటాలు కూడా తినటం మంచింది. మొలకెత్తిన గింజలు, ధాన్యం, బీన్స్ లో పోషకవిలువలు ఎక్కువగా ఉంటాయి. అవి తీసుకోవటం వల్ల పోషకాహారం సమృద్ధిగా లభిస్తుంది. అంతే ఈ క్లిష్ట పరిస్థితుల్లో ఇమ్యునిటీ పవర్ చాలా అవసరం. ఇలాంటివి తినటం వల్ల ఇమ్యునిటీ పవర్ కూడా పెరుగుతుంది. పిల్లల ఎదుగుదల వారు తినే ఆహారం పైనే ఆధారపడుతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఫాస్ట్ ఫుడ్స్ కంటే ఇలాంటివి పిల్లలకు పెట్టడం వల్ల వారు ఆరోగ్యంగానూ చురుగ్గానూ ఉంటారు. అప్పడే చదువులోనూ, గేమ్స్ లోనూ యాక్టీవ్ గా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: