బుడుగు: పిల్లలకు ఇలాంటి ఆహారం పెట్టండి..!!
ఈ దశలోనే పిల్లలకు బలమైన పౌష్టికాహారం ఇవ్వాలి. తీనే ఆహారంలో ఐరన్ ఉండేలా చూసుకోవాలి. ఎముకలు బలంగా ఉండే ఆహారం అందించాలి. ఈ దశలో పిల్లలకు సరైన ఆహారం, వ్యాయామం కావాలి. పిల్లల్లు చురుగ్గా ఉండేలా తల్లిదండ్రులు ప్రోత్సాహించాలి. ముఖ్యంగా ఔట్ డోర్ గేమ్స్ కు ప్రాధాన్యం ఇవ్వాలి.
కానీ, మారుతున్న జీవనశైలిలో తల్లిదండ్రులు ఇద్దరూ వారి వ్యక్తిగత జీవతంలో బిజీగా ఉండటంతో పిల్లలను చూసుకోవటానికి కేర్ టేకర్స్, డే కేర్ సెంటర్లు వచ్చేశాయి.. వాళ్లు మన అమ్మమ్మలు నాటి ఆహారం ఎందుకు పెడతారు...టేస్టీగా ఉండే బిస్కెట్లు, పిజ్జాలు, శాండ్ విజ్, బర్గర్లు, న్యూడిల్స్ అంటూ పిల్లలకు పెడుతున్నారు. ఇవన్నీ ప్రాసెస్ చేసి వేయించివవటంతో వీటిల్లో పోషకార విలువలు చాలా తక్కువగా ఉంటాయి. వీటిని తినటంలో శరీరంలో అధిక కొవ్వు పెరుగుతుంది. దాంతో పిల్లల ఎదుగుదల పై తీవ్ర ప్రభావం పడుతుందని పోషకాహార నిపుణులు సువర్ణ పాఠక్ అంటున్నారు.
ఏదో రుచిగా ఉందని మనం పిల్లకు పెడుతున్నాం కానీ..వీటి వల్ల పిల్లలకు కావాల్సిన విటమిన్లు అందవు. ఫలితంగా పిల్లలో అనేక సమస్యలకు కారణమవుతుంది. వారిలో గ్యాస్ట్రో ఇంటెస్టినల్, పేగు సంబంధిత వ్యాధులు రావటానికి ఒకరకంగా ఇవే కారణమవుతాయి. పిల్లలకు విటమిమ్ డి3, బి3, బి12, ఐరన్ చాలా అవసరం. మనం రోజు ఇచ్చే ఆహారంలో ఇవి ఉండేలా చూసుకోవాలి. వాటివల్ల ఎముకలకు, నరాలకు, కండరాలకు బలం చేకూరుతుంది.