బుడుగు: పిల్లలకు మొదటిసారి ఆహరం తినిపించేటపుడు ఇలా చేయండి..!

N.ANJI
సాధారణంగా పిల్లలకు పాలు మానిపించేది అనేది కొంచెం కష్టమైన పని. కానీ పిల్లలకు పాలు మనిపించిన తరవాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. సాధారణంగా కొత్తగా ఘణ పదార్థాలు తినే పిల్లలు దానిని బయటికి ఊసేస్తారు. అది వారి గొంతులో ఇరుక్కోకుండా ఉండటానికి శరీరం ఆచరించే ఒక రిఫ్లెక్స్ యాక్షన్. అటువంటి సమయంలో ఆహారాన్ని నున్నగా గుజ్జులా చేసి తినిపిస్తే పిల్లలు బయటికి ఊసేయకుండా ఉంటారు. అంతే కాకుండా మీరు ఇవ్వాలనుకునే ఆహారంలో కొన్ని చుక్కలు రొమ్ము పాలు వేయడం ద్వారా రుచి ముందే తెలిసుండటం వలన పిల్లలు ఇష్టంగా తింటారు. అప్పటికి తినకపోతే ఇంకో వారం వేచి ఉండి ప్రయత్నించండి.
ఇక చిన్నారి అన్నం తినిపించడానికి వెళ్తుంటే మొఖం తిప్పేస్తుందా? అంటే తాను తినే మూడ్లో లేదు అని అర్థం ఆ ఆహరం నాచల్లేదు అని అర్థం. అటువంటి సమయంలో ఇతర ఆహరం ఇవ్వడానికి ప్రయత్నించండి. కనీసం కొంత అయినా తినిపించండి. నిదానంగా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా తినేస్తారు. చిన్నారికి ఏదయినా కొత్త ఆహారం తిన్నప్పుడు విచిత్రమైన ఎక్సప్రెషన్ ఇస్తున్నాడా? కంగారుపడకండి.
అయితే చిన్నారి నాలుక కొత్త రుచులకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతోంది. ఏ ఆహారం అయినా చిన్నారికి అలవాటు పడటానికి కనీసం 15 సార్లు దాని రుచి చూడాలి. ఒక వయస్సు వచ్చాక వారి చేతులతో తినటాన్ని ప్రత్సాహించాలి.  ఎప్పుడు మనం తినిపించడమే కాకుండా వాళ్ళే తినే లాగా మనం నేర్పించాలి. దీనికి మొదట్లో పిల్లలు ఇష్టపడకపోవచ్చు కావున నచ్చిన పదార్థాలను ఇచ్చి ఈ అలవాటుని ప్రోత్సహించాలి.
అంతేకాదు.. అందరి పిల్లలకు అన్ని రకాల ఆహారాలు మొదట్లో పడవు. దానిని మనం గమనించుకొని కొత్త ఆహరం ఏమైనా పెడుతున్నప్పుడు ఎలర్జీ వస్తుందేమో అని చూడాలి. డైపర్ మార్చే సమయంలో ఎర్రగా రాషెస్ కింద భాగంలో కనపడితే ఎలర్జీ అని భావించవచ్చు. అటువంటి ఎలర్జీ కలిగించిన పదార్థాలను కొన్ని రోజులు దూరంగా ఉంచండి. ఘాణ పదార్థం ఇవ్వడం ఆరంభించిన మొదట్లో పిల్లలకు మలబద్దకం వచ్చే ప్రమాదం ఉంది. రోజుకి ఎన్ని సార్లు పూ వెళ్లే వాడు అని గమనిస్తే దీనిని గుర్తించవచ్చు. డాక్టర్ని మలబద్దకానికి కారణం అయిన పదార్థాలను గుర్తుపెట్టుకోండి. ఘాణ పదార్థాలు ఇవ్వడం ఆరంభించినప్పుడు వాటిలో పీచు పదార్థం ఉండేలా చూసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: