ఒక ఊరిలో నలుగురు స్నేహితులున్నారు. వారు విజ్ఞానంతోపాటు తమ పోషణ కోసం ఇతర కళలను నేర్చుకోవడానికి బయలుదేరారు. వారు ఒక గొప్ప యోగికి సేవలు చేసి ఆయన అనుగ్రహంతో కొన్ని మానసిక శక్తులను విద్యలను నేర్చుకున్నారు. నలుగురిలో ఒకడికి విరిగిన ఎముకలను జత చేసే శక్తి అబ్బింది. రెండోవాడు తగిలిన గాయాలను మాన్పించే శక్తిని నేర్చుకున్నాడు. మూడోవాడు రక్తనాళాలలో రక్తాన్ని ప్రసరింపజేయగల నేర్పును పొందాడు. నాలుగవవాడు ప్రాణం పోసే విద్యను సాధించాడు.
ఈ నలుగురు నాలుగు దివ్యశక్తులను పొందగలిగారు. ఈ తరువాత గురువు గారివద్ద శెలవు తీసుకొని వారు ఇంటి ముఖం పట్టారు. ఊరు చేరడానికి అడవి గుండా పోవాల్సివచ్చింది. క్రూర మృగాలకు ఆలవాలమై ఆ అడవిలో నలుగురు కలిసి ఒక చచ్చిన సింహాన్ని చూచారు. తమ శక్తులను ఉపయోగించి, ఈ సింహాన్ని బతికించాలనే కోరిక వారిలో కలిగింది. ఇది కౄరజంతువు దీన్ని బతికించితే అది మనలను చంపుతుంది. అని ఒకడు చెప్పాడు.
అందుకు ఇంకొకడు మనము దీన్ని బతికించాం, కాబట్టి మనలను ఏమీ చేయదు అని పని ప్రారంభించారు. ఈ సింహాన్ని బతికించితే అది మనలను చంపుతుంది అన్నావాడు చచ్చిన సింహం ఎముకలను జోడించి, పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నాడు. రెండవవాడు గాయాలను మానేలా చేశాడు. మూడవవాడు అబ్బిన విద్య రక్త ప్రసరణను కలగజేసాడు. ఇప్పుడు నాలుగోవాడి వంతు వచ్చింది. వాడు తన విద్యను ఉపయోగించి మళ్ళీ ప్రాణం పోసాడు వచ్చిన సింహం ఈ ముగ్గురిపై విరుచుకుపడి వారిని ఆహారంగా భుజించింది. చెట్టుపైకి ఎక్కినవాడు. జరిగిన సంఘటన చూస్తూ ఉండిపోయాడు.
ఈ కథలోని నీతి : తెలివిలేని బలం, విద్యా అనర్థాలకు దారి తీస్తుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: