బుడుగు: పిల్లలు పడుకునే ముందు పాలు తాగిస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..!?

N.ANJI
చాల మంది పిల్లలకు రాత్రి పడుకునే ముందు పాలు తాగిస్తుంటారు. మిల్క్ బిస్కెట్ సిండ్రోమ్ ని మిల్క్ ఎండ్ కుకీ డిసీజ్ అని కూడా అంటారు. ఇది ఎదిగే పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సిండ్రోమ్ గురించి చాలా మందికి తెలియదు. అయితే ప్రాసెస్డ్ ఫుడ్, ఎక్కువ షుగర్ తీసుకునే పిల్లల్లో ఈ మిల్క్ ఎండ్ కుకీ డిసీజ్ కనపడుతుంది. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ప్రత్యేకించి రాత్రి డిన్నర్ తరువాత ఈ సిండ్రోమ్ కి కారణం అవుతాయి. దీని పేరు మిల్క్ బిస్కెట్ సిండ్రోమ్ అని ఉంది కానీ, కేవలం పాలు, బిస్కెట్స్ వల్ల మాత్రమే ఈ సిండ్రోమ్ రాదు. పాలు, బిస్కెట్స్, సాఫ్ట్ డ్రింక్స్, సోడా, పాక్ చేసిన జ్యూసెస్, ఫ్లేవర్డ్ యోగర్ట్, ఐస్‌క్రీం, చాకొలేట్, ఇంకా షుగర్ ఎక్కువగా ఉన్న పదార్ధాలన్నీ ఈ సిండ్రోమ్ కి కారణాలే.
ఇక ఎక్కువసార్లు ఈ సిండ్రోమ్ ని సరిగ్గ డయాగ్నోజ్ చేయరు. అలాంటప్పుడు సమస్య తగ్గకపోగా ఇంకా పెరుగుతుంది కూడా. మెడిసిన్స్ కేవలం లక్షణాలని మాత్రమే ట్రీట్ చేస్తాయి. ఈ ఈటింగ్ పాటర్న్ మారకపోతే మెడిసిన్స్ డోస్ అవ్వగానే మళ్ళీ మొదలవుతాయి. ఈ సిండ్రోమ్ ని కంట్రోల్ లో పెట్టడానికి ఒకటే ఒక మార్గం - పిల్లలకి రాత్రి పూట ఇవి పెట్టకపోవడమే. రాత్రి నిద్రకి ముందు డైరీ ప్రోడక్ట్స్, షుగర్ ఎక్కువగా ఉన్న ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ తినిపించడం మానేయండి. ఇందువల్ల యాసిడ్ రిఫ్లక్స్ ని ప్రివెంట్ చేయవచ్చు. యాసిడ్ రిఫ్లక్స్ వల్లనే మిల్క్ బిస్కెట్ సిండ్రోమ్ వస్తుంది.
అయితే రాత్రి నిద్రకి ముందు ఒక గ్లాసు గోరు వెచ్చని పాలు పిల్లలకి ఇచ్చే అలవాటు చాలా మందికి ఉంటుంది. మీకు కూడా ఈ అలవాటు ఉండి, మీ పిల్లలకి తరచు దగ్గు, కంజెషన్, సోర్ థ్రోట్, కాన్స్టిపేషన్ వంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటే మీ డాక్టర్ ని ఒకసారి కన్సల్ట్ చేసిన తరువాతే ఈ అలవాటుని కొనసాగించండి. పాలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందు వల్ల పాలు తాగే టైమ్ ని రాత్రి నుండి పగలుకి మార్చండి. మీ పిల్లలలి పాల నుండి వచ్చే పోషకాలూ అందుతాయి, వేరే సమస్యలేమీ రాకుండా కూడా ఉంటాయి. ఈ సిండ్రోమ్ ఉన్న పిల్లలకి రాత్రి నిద్ర కి ముందు అరటి పండు, యాపిల్ వంటివి పెట్టవచ్చేమో మీ డాక్టర్ ని కన్సల్ట్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: