బుడుగు: మీ పిల్లలు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారా.. ఇలా చేయండి..!?
ఇక ప్రొబయోటిక్ ఆహార పదార్థాల వల్ల కలిగే ప్రయోజానాల అందరికి తెలిసిందే. అయితే వాటిలో ఉండే బ్యాక్టిరీయాలు మానవ శరీరానికి చాల ఉపయోగకరమైనవిగా ఉంటాయి. ప్రదానం గా జీర్ణక్రియను చురుకుగా చేసి మంచి ఆరోగ్యాన్నీ కలిగిస్తాయి.అలర్జీని తగ్గించడం తో పాటు శరీరం లో రోగ నిరోధక శక్తి ని పెంచుతాయి . ఈ పొషకాలు మనకు పెరుగు, మజ్జిగ, పచ్చడి.. వంటి పులియబెట్టిన ఆహార పదార్థాలలో లభిస్తాయి.
అంతేకాక ప్రొబయోటిక్స్ వల్ల మరింత మేలు చేకూర్చే ప్రయోజనాలు ఉన్నట్టు తాజాగా జరిపిన ఓ అధ్యయనంలో కూడా స్పష్టమైంది. ఇక బాల్యం, కౌమార దశలో ఊబకాయంతో బాధపడుతున్న వారి సమస్యను తగ్గించడంలో ప్రొబయోటిక్స్ శక్తివంతంగా పనిచేస్తాయని తెలిపారు. ఇక యూరోపియన్ సొసైటీ ఆఫ్ ఎండోక్రినాలజీ-2020లో ఈ అధ్యయనం ఫలితాలను వెల్లడించారు.
అయితే 6 నుంచి 18 సంత్సరాల మధ్య వయసు ఉండి ఊబకాయంతో బాధపడుతున్న 100 మందిపై దాదాపు 8 వారల పాటు పరిశోధన జరిగింది. వారికీ క్యాలరీస్ నియంత్రిత ఆహారం ఇవ్వడంతోపాటుగా ప్రొబయోటిక్స్ ను కూడా ఇవ్వడం వలన జీవక్రియ శక్తివంతంగా మారి.. పిల్లలు, కౌమర దశలో ఉన్నవారు బరువు తగ్గినట్టుగా తెలిసింది. దీనితో పాటు పిల్లలో డయాబెటిస్, గుండెపోటుతో పాటు ఇతర అనారోగ్య సమస్యల ను కూడా ప్రొబయోటిక్స్ తగ్గిస్తుందని పరిశోధకులు తెలిపారు.
ఇక జీవక్రియలో ప్రొబయోటిక్స్ పాత్రను మరింతగా అర్థం చేసుకోవాలని అనుకుంటున్నట్టు పరిశోధకులు తెలిపారు. కాబట్టి పిల్లలకు ఈ ఆహారం ఇవ్వడంతో పాటు శరీరం అలసిపోయేలా ఆడుకోవడం అనేది చాలచాలా అవసరం అని గుర్తు పెట్టుకోండి. అలా ఆడడం వలన శారీరకంగా మానసికంగా కూడా ఉత్సహంగా ఉంటారు.