బుడుగు: తల్లిదండ్రుల ప్రవర్తన వల్లే.. పిల్లల్లో మార్పులు..!

N.ANJI
పిల్లల పెరుగుదల వచ్చే మార్పులలో తల్లిదండ్రుల ప్రభావం ఎక్కువగా ఉంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. పిల్లలు అనుచితంగా ప్రవర్తించినా.. చెప్పిన మాట వినకుండా ఎదురు మాట్లాడితే వారికి అర్థమయ్యేలా వివరించాలని వారు చెబుతున్నారు. ప్రేమతో బుజ్జగిస్తూ మాట్లాడుతుంటే పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయని, మంచి పనులు నేర్చుకుంటారని వారు పేర్కొన్నారు. కోప్పడుతూ.. ఎప్పుడూ కొట్టేందుకు చేతులెత్తితే వారి ప్రవర్తనలో పోల్చలేని మార్పులు కనిపిస్తాయని అంటున్నారు. చిన్నారుల ప్రవర్తనపై పలు ఆసక్తి కరమైన విషయాలను వారు తెలియజేశారు.
తాజాగా చిన్నారుల ప్రవర్తనపై సర్వే నిర్వహించారు. అనుచితంగా మాట్లాడటం, చెప్పిన మాట వినకపోవడం తదితర అంశాలపై పరిశోధకులు సర్వే నిర్వహించారు. అయితే పిల్లల ప్రవర్తనలో మార్పులు రావడానికి తల్లిదండ్రులు ఒక కారణమని చెప్పుకోవచ్చన్నారు. పిల్లల్లో ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు వారిని దగ్గరికి తీసుకుని సమస్య అర్థమయ్యేలా వివరించాలని.. అప్పుడే సవ్యంగా ఉంటారన్నారు.

పిల్లలపై కోప్పడితే పిల్లల ప్రవర్తనలో మార్పులు వస్తాయని అధ్యాయనాలు చెబుతున్నాయి. ఎలాంటి సందర్భంలోనైనా సరే, పరిస్థితుల ప్రభావాన్ని వారికి ప్రశాంతంగా వివరించడానికి తల్లిదండ్రులు ప్రయత్నించాలని తెలుపుతున్నారు. పిల్లలతో మాట్లాడేటప్పుడు భాష, ధ్వని గంభీరంగా ఉండొద్దని, సున్నితంగా మాట్లాడుతూ.. సానుకూల క్రమశిక్షణ అలవడేలా చేస్తాయని సర్వే చెబుతున్నాయి.  
అమెరికాకు చెందిన మిచిగాన్ యూనివర్సిటీ పరిశోధకులు పిల్లల ప్రవర్తనకు సంబంధించిన వివిధ రకాల అంశాలు, వారిని మందలించడం వల్ల ఎదురయ్యే సమస్యలపై అధ్యాయనం చేశారు. ఈ అధ్యాయనం కోసం యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్ గతంలో నిర్వహించిన సర్వేల డేటాను విశ్లేషించారు. పిల్లలను వేధించడం, వారిని శారీరకంగా శిక్షించడం వల్ల వారి ప్రవర్తనలో విపరీతమైన మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు గుర్తించారు. పిల్లల్లో కోపం, దూకుడుతనం, ఏకాగ్రత, లోపాలు వంటి ఇబ్బందులు పెరుగుతాయని చెబుతున్నారు. అయితే ఈ విషయాలు వివరించి చెప్పడం వల్ల ఎలాంటి సమస్యలూ ఉండవని అధ్యయనం తేల్చింది. తల్లిదండ్రులు పిల్లలతో మెరుగైన సంబంధాలు కొనసాగించాలని పరిశోధకులు సూచిస్తున్నారు. పిల్లలపై చేయి చేసుకోవడం, కోప్పడటం వల్ల బ్యాడ్ పేరెంట్‌గా చూస్తారని, పిల్లలు భయాందోళనకు గురవుతారని పరిశోధకులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: