బుడుగు: చలికాలంలో పిల్లలను వీటికి దూరంగా ఉంచండి..!?

N.ANJI
చలికాలం వచ్చిందంటే సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా పిల్లలకు అనేక రకాల ఆరోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే సీజన్ ఇది. గొంతు నొప్పి, జలుబు, కడుపులో ఇన్ఫెక్షన్, న్యుమోనియా, చెవి ఇన్ఫెక్షన్, ఆస్తమాలతో పాటు చర్మం పొడిబారి దురద రావడం లాంటివి వింటర్‌లో చాలా మంది పిల్లలు ఎదుర్కొనే సమస్యలు. పిల్లల్లో సరైన ఇమ్యూనిటీ ఉంటే ఇలాంటి సమస్యలు దగ్గరకు రాకుండా చూసుకోవచ్చట.
ఈ కాలంలో పిల్లలకు డీప్ ఫ్రై చేసిన ఫుడ్ పెట్టకూడదు. ముఖ్యంగా బయట నుంచి తీసుకొచ్చిన ఆహారపదార్థాలు అస్సలు తినకుండా చూసుకోవాలి. ఎందుకంటే బయట ఆహారాన్ని వేయించేందుకు ఒమెగా-6 ఫ్యాటీ యాసిడ్స్, మాంసంతో తయారైన నూనె ఉపయోగిస్తున్నారు. ఇవి లాలాజలం, శ్లేష్మం పెంచి గొంతు సమస్యలకు దారితీస్తాయి. పిల్లలు బాగా మారాం చేస్తే ఇంట్లోనే కూరగాయలతో తయారు చేసి ఇవ్వండి.
అయితే షాప్‌కు వెళ్లినా, లేదా ఏదైనా మార్ట్‌కు వెళ్లినా పిల్లలు మొదటగా కావాలనేది క్యాండీస్. అవి తీసుకునేదాకా మారాం చేస్తూ ఉండిపోతారు. కానీ ఇవి పిల్లలకు అస్సలు మంచిది కాదంటున్నారు. వీటిలో చెక్కర శాతం ఎక్కువగా ఉండటం వల్ల తెల్ల రక్త కణాలు దెబ్బతిని అనారోగ్యానికి కారణమవుతాయట. తీపిదనం ఎక్కువగా ఉన్నందున ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయట. మామూలుగా అయితే మాంసం, గుడ్డు అధిక పోషకాలతో కూడిన ఆహార పదార్థాలు. కానీ చలికాలంలో అధికంగా తినడం వల్ల గొంతులో శ్లేష్మం పెరుగుతుంది. ఇది పిల్లలను చాలా ఇబ్బంది పెడుతుంది. వీటికి బదులు చేపలు లేదా ఆర్గనిక్ మీట్ ఇవ్వడం మంచిది.
ఇక పాల పదార్థాలు కూడా లాలాజలం, శ్లేష్మం పెంచుతాయి. తద్వారా మింగడంలో ఇబ్బందులు ఎదుర్కోవాల్పి వస్తుంది. కాబట్టి పిల్లలను పాలతో తయారుచేసిన చీజ్, క్రీం, సూప్స్, వంటి వాటికి దూరంగా ఉంచడం మంచిది. వీటితో పాటు పిల్లలు సోడా, కూల్ డ్రింక్స్, చాకొలెట్స్, కు దూరంగా ఉండేలా చూసుకుంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: