బుడుగు: పిల్లలు ఇంటర్నెట్ ని వదలడం లేదా.. అయితే ఇవి గమనించండి..!?
చాల మంది పిల్లలు శృంగారానికి సంబంధించిన మెసేజ్‌లకి భావి భారత పౌరులు బాగా ఆకర్షితులవుతున్నారు. వీటి వల్ల పట్టుమని 16 ఏళ్ళు రాని పిల్లలు కూడా తోటి విద్యార్థులతో అసభ్యంగా ప్రవర్తిస్తూ పిచ్చి పనులకు పాల్పడుతున్నారు. ఆ పిచ్చికి ప్రేమ అంటూ పేరు పెట్టి ఆనాటి బాల్య వివాహాలు కళ్ళముందుకు తెస్తూ తల్లిదండ్రుల ని చిత్రవధకి గురిచేస్తున్నారు. అయితే.. ఈ సౌకర్యం పిల్లల్ని తప్పుదారిలోకి నడిపిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంతో వారు వెళ్లకూడని దారిలో వెళ్తున్నారు. పిల్లలు ఇలాంటి చెడుఅలవాట్లు బారిన పడకుండా తలిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలు సుకుందాం.
పిల్లలు ఏం చేస్తున్నారు. ఎలా ఉంటున్నారని వారి ప్రతి పని పై పెద్దలునిఘాపెట్టాలి. ఇంటర్నెట్ లో పిల్లలు ఏమి చూస్తున్నారు.. ఎప్పటికప్పుడు ఆరాతీస్తూ ఉండాలి. ముఖ్యంగా స్కూల్ లో పిల్లలు ఎలా ఉంటున్నారో వారి టీచర్లని అడిగి తెలుసుకుంటూ ఉండాలి. పిల్లలతో తల్లిదండ్రులు ఎప్పుడూ స్నేహంగా మెలుగుతూ వారికి దగ్గరగా ఉంటూ ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించడం వలన ప్రమాదాన్ని అడ్డుకోవచ్చు.
ఇక ఈ జాగ్రత్తలు తీసుకుంటే మన పిల్లల్ని వారి భవిషత్తుని రక్షించుకున్నవారిమవుతాం. చివరిగా ఒక్కమాట.. మనం జీవితంలో ఎంత తీరిక లేకుండా పనిచేస్తే అంత ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందేమో కానీ పిల్లలు కోల్పోతున్న బాల్యాన్ని, ప్రేమని సంరక్షణని మాత్రం ఎంత డబ్బు ఇచ్చిన తిరిగి తీసుకురాలేమని ప్రతి తల్లి తండ్రి గుర్తుపెట్టుకోవాలి మరి.