చెడు ఆలోచన ప్రభావం

Durga
 ఒక మంత్రిగారు పనిమీద ఒక గ్రామం మీదుగా వెళుతున్నాడు అతనికి దాహంగా ఉండి దగ్గర్లోనే ఉన్న పొలంలోకి వెళ్ళాడు. మంత్రిగారికి రైతు తన చెరుకు తోటనుంచి తాజా చెరుకు రసం తీసి ఇచ్చాడు. తీయని చెరుకు రసం తాగిన తరువాత మంత్రిగారి కళ్ళు చెరుకు తోట పై పడ్డాయి. ఏపుగా పెరిగిన ఈ పంటనుండి అదనంగా ఎంత పన్ను వసూలు చేయవచ్చునో మనసులోనే లెక్కలు వేసుకున్నాడు. మంత్రి ఇంకొంచెం చెరుకు రసం తీసురమ్మాన్నాడు. ఈసారి తెచ్చి ఇచ్చిన చెరుకు రసం అంత తియ్యగా లేదు. మంత్రి ఆశ్చర్యంతో తన సందేహానని వెలిబుచ్చాడు. మీ మనసులో అసూయ ప్రవేశించిన వెంటనే చెరుకు రసం తన తియ్యదనాన్ని కోల్పోయింది ప్రభూ ! అని రైతు సమాధానం ఇచ్చాడు. తన తప్పు తెలుసుకున్నాడు మంత్రి. ఈ కథలోని నీతి : చెడు ఆలోచనలు పరిసరాలను కలుషితం చేస్తాయి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: