బుడుగు : పిల్లలు పాలు తాగడం వల్ల ఎన్ని ఉపయోగాలో చుడండి.. !!

Suma Kallamadi
చిన్నపిల్లలకు చిన్నవయసు నుంచే పోషక ఆహారం పెట్టాలి. పోషక ఆహారంలో పాలు ముఖ్య పాత్ర పోషిస్తాయి. అయితే చాలా మంది పిల్లలు పాలు తాగే విషయంలో కాస్త ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్లకు నచ్చితే తాగుతారు లేకపోతే లేదు. చాలా మంది పిల్లలతో తల్లి తండ్రులు ఎదుర్కొనే సమస్య ఇది. అందుకే చాలా మంది తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్య విషయంలో ఆందోళన చెందుతుంటారు. పిల్లలకు పూర్తి పోషకాలు అందాలంటే వారికి పాలు పట్టించడం తప్పనిసరి అయిపోయింది. పిల్లలు పూర్తి కొవ్వు పాలు కాకుండా తక్కువ కొవ్వు ఉన్న పాలు మాత్రమే తాగడానికి ఇష్టపడుతుంటారు.అంతేకాదు తల్లిదండ్రులు కూడా ఫ్యాట్ ఉన్న పాలు తాగడం వలన పిల్లలు బరువు పెరుగుతారు అని భావిస్తూ ఉంటారు. అయితే అది కరెక్ట్ కాదని అంటున్నారు నిపుణులు.


పూర్తి కొవ్వు పాలలో అధిక రుచితో పాటు చిన్న పిల్లలకు అవసరమైన శక్తి కూడా అందుతుంది. అందుకోసం పిల్లలకు ఎక్కువ కొవ్వు ఉన్న పాలు ఇవ్వటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు భావిస్తున్నారు. పూర్తి కొవ్వు పాలలో అధిక పోషక విలువలు ఉండటం వల్ల పిల్లలకు శక్తి లభిస్తుంది. ఆవు పాలు పిల్లలకు పట్టించడం తప్పనిసరి ఎందుకంటే కొవ్వు పదార్ధం ఆవు పాలల్లో ఎక్కువగా ఉంటుంది.


పాలల్లో ఉండే కాల్షియం, అయోడిన్, విటమిన్లు ఎ మరియు బి 12, మరియు కొవ్వు పిల్లలకు మంచి బలాన్ని అందిస్తాయి.అలాగే పాలల్లో ఉండే కాల్షియం వల్ల పిల్లల ఎముకలు బలంగా, దృడంగా తయారవుతాయి. కాబట్టి తల్లిదండ్రులు వారి పిల్లల ఆరోగ్యం కోసం ఎక్కువ శ్రద్ద వహించాలి. వారి ఆహార అలవాట్లు విషయంలో వైద్యులను సంప్రదించి వారి శరీరానికి కావలసిన పోషక ఆహారాన్ని అందించాలి. ముఖ్యంగా పిల్లలకు పాలను చిన్నపటి నుంచి అలవాటు చెయ్యాలి.కొంతమందికి పాల వాసన అసలు నచ్చదు.. అలాంటి పిల్లలకు పాలల్లో బూస్ట్ గాని హార్లిక్స్ గాని కలిపి ఇవ్వండి..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: