బుడుగు : మీ పిల్లల అధిక బరువును తగ్గించుకోండి ఇలా.. !!
మీ పిల్లలు అధిక బరువును కలిగి ఉండటం అనేది వారి జీవితంలో అత్యంత క్లిష్టమైన అనుభం. ఇది ఆరోగ్యసమస్యలకు మాత్రమే కాదు, మానసిక ఒత్తిడి మరియు డిప్రెషన్ కూడా కలిగిస్తాయి.పిల్లలు బరువు పెరగడానికి వంశపారంపర్యం, ఆహారం లేదా ఏదైనా సంబంధిత వైద్య పరిస్థితులు వల్ల అధిక బరువు పెరగడానికి కారణం కావచ్చు . ప్రస్తుత ఫాస్ట్ లైఫ్ లో భౌతిక వ్యాయామం లేకపోవడం వల్ల కూడా అందుకు ప్రధాన కారణం కావచ్చు. ఒక పేరెంట్ గా మీ పిల్లలు ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటం మీదే బాధ్యత.
కాబట్టి, ఇప్పటి నుండే మీ పిల్లలు ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండటం కోసం కొన్ని వెయిట్ లాస్ టిప్స్ ను అనుసరించండి.ఆరోగ్యకరమైన బరువును తగ్గించుకవడంలో ముఖ్యంగా మీరు చేయవల్సిన పని, వారి బరువు మరియు ఎత్తును పరిగణలోకి తీసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన బరువను నిర్వహించవచ్చు.వారి ఎత్తుకు తగ్గ బరువు నుండి అదనపు బరువు పెరగకుండా మెయింటైన్ చేయాలి.పిల్లల యొక్క ఆరోగ్యకరమైన బరువు తగ్గించే చిట్కాలలో మీరు డైట్ కంట్రోల్ ఒక ప్రధాన ఎంపిక. పిల్లల మెను నుండి షుగర్స్, బెవరేజెస్, జంక్ ఫుడ్స్, ప్రొసెస్డ్ ఫుడ్స్ లేదా క్యాన్డ్ ఫుడ్స్ మరియు అధిక కాలరీలు కలిగి స్నాక్స్ వంటి ఆహారాలను తగ్గించాలి లేదా పూర్తిగా తినకుండా నివారించాలి.
ఇది పిల్లల్లో ఆరోగ్యకరమైన బరువు తగ్గించడంకోసం సహాయపడవచ్చు. మీ పిల్లలను హెల్త్ క్లబ్ లేదా జిమ్ లో చేర్పించడం లో ప్రయోజనం లేదు. వారు చేయాల్సిందల్లా వారి ఫిజికల్ యాక్టివిటీస్ పెంచడానికి కొంత చొరవ తీసుకోవాల్సి ఉంటుంది.పిల్లల్ని వారి గదుల నుండి బయటకు పంపించండి అప్పుడే వారు బయట యాక్టివిటీస్ లో చురుకుగా పాల్గొటారు.వీలయినంత ఎక్కువ సేపు పిల్లల్ని బయట ఆడుకోనివ్వండి. ఇది అధిక కాలరీలను బర్న్ చేయడానికి సహాయపడుతాయి. కొంత వ్యాయామం చేయడం ఎప్పటికీ ఆరోగ్యకరం. కాబట్టి, మీ పిల్లల కోసం మీరు కూడా కంపెనీ ఇవ్వొచ్చు, అప్పుడే మీ పిల్లలను బరువు తగ్గడానికి ఏదైనా చేయమని చెప్పవచ్చు. ఇద్దరూ కలిసి ఆడండి లేదా వ్యాయామం చేయండి లేదా నడకతో మొత్తం ఫ్యాలి ఫన్ చేయండి. పిల్లలకు ఇది ఒక హెల్తీ వెయిట్ లాస్ చిట్కా.