ఇలాంటి లక్షణాలు మీ పిల్ల‌ల్లో క‌నిపిస్తే.. షుగర్ వ్యాధి ఉన్నట్లే..?

Kavya Nekkanti

మధుమేహం లేదా షుగర్ వ్యాధి లేదా డయాబెటిస్ పేరు ఏదైనా జ‌బ్బు ఒక్క‌టే. ఒక్క‌సారి షుగ‌ర్ వ్యాధి వ‌చ్చిందంటే.. అది జీవితాంతం మ‌న‌తోనే ఉంటుంది. అందుకే శత్రువైనా జాలిపడి ఒదిలేస్తాడేమో గానీ షుగర్‌ వ్యాధి ఒకసారి వచ్చిందంటే వ‌ద‌ల‌ద‌ని అంటారు. శరీరంలో ఇన్సులిన్ శాతం ఎప్పుడైతే త‌గ్గుతుందో.. అప్పుడు మధుమేహం వస్తుంది. షుగర్‌ రావడానికి ప్రధానమైన కారణాలు.. అధిక బరువు, ఆహార అలవాట్లు, శరీరానికి శ్రమ లేకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్‌, మానసికఒత్తిడి ఇవి ప్రధానమైనవి. ఇక షుగ‌ర్ వ్యాధి ఎవరికైనా రావచ్చు. 

 

మన దురదృష్టం కొద్దీ చిన్నారులకి కూడా షుగ‌ర్ వ్యాధి వ‌స్తుంది. అయితే చాలా మంది చిన్నవారిలో ఈ సమస్య రాదనే భావనతో.. దాన్ని గుర్తించట్లేదు. కానీ, కొన్ని లక్షణాలతో దీన్ని ఈజీగా గుర్తుపట్టొచ్చని చెబుతున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇందులో ముందుగా.. డయాబెటీస్ ముఖ్య లక్షణం బరువు తగ్గడం. ఆరోగ్యంగా ఉన్న‌ చిన్నారులు ఉన్నట్టుండి ఒక్క‌సారిగా బరువు తగ్గితే మాత్రం ఖ‌చ్చితంగా వానికి హాస్ప‌ట‌ల్‌కి తీసుకువెళ్లి ప‌రీక్ష‌లు చేయించాలి. అలాగే షుగర్ వ్యాధి ఉంటే పిల్లలు అతిగా మూత్ర విసర్జన చేస్తుంటారు. ఆ విషయాన్ని కూడా ఖ‌చ్చితంగా గ‌మ‌నిస్తూ ఉండాలి.

 

అదేవిధంగా, షుగర్ వ్యాధి ఉంటే ఎక్కువగా దాహం వేస్తుంటుంది. అలాంటి టైమ్‌లో పిల్లలు నీరు ఎక్కువగా తాగుతుంటారు. ఇలా తాగుతుంటే కూడా అనుమానించాల్సి ఉంటుంది. ఇక చిన్నాారులు అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తుంటుంది. ఇది ఎక్కువగా జీర్ణశక్తి లోపించినప్పుడు అనుకుంటాం. కానీ, కొన్ని సార్లు షుగర్ వ్యాధి ఉన్నా చిన్నారుల్లో కడుపు నొప్పి అంటూ ఇబ్బంది పడతారు. ఈ విష‌యంలో కూడా ఆలోచించాల్సిందే. మ‌రియు చిన్నారులు చాలా సార్లు తమకు సరిగా కనిపించడం లేదని చెబుతారు. షుగర్ వ్యాధి ఉన్నా ఇదే సమస్య కనిపిస్తుంది. సో.. ఇలాంటి ల‌క్ష‌ణాలు మీ పిల్ల‌ల్లో క‌నిపిస్తే.. ఖ‌చ్చితంగా వారికి ప‌రీక్ష‌లు చేయించి త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోండి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: