బుడుగు : మీ పిల్లలు రాత్రిపూట సరిగా నిద్రపోవడంలేదా.. !!అయితే ఒకసారి ఇలా చేసి చుడండి... !!

Suma Kallamadi
రాత్రి వేళ్లలో మీ పిల్లలను నిద్రపోయేలా చెయ్యడం చాలా కష్టమైన పని అని చాలామంది తల్లిదండ్రులకు  తెలియదు. వారు తెలుసుకోవలసిన చాలా కష్టమైన విషయాల్లో ఇది ఒకటి.

మీ పిల్లలు నిద్రపుచ్చేందుకు సంబంధించిన సమస్యల నుండి మీరు బాధపడుతున్నట్లయితే, రాత్రి వేళ్లలో మీ పిల్లలను నిద్రపోయేలా చేయడానికి కొన్ని  సులభమైన చిట్కాలను అనుసరించండి. ఇది నిజంగా మీకు చాలా సహాయకారిగా ఉంటుంది!మీ పిల్లల నిద్ర విషయంలో - ఆహారం (డైట్) అనేది చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. నిద్ర సమస్యలను కలిగి ఉన్న పిల్లలకు రాత్రివేళల్లో ఎక్కువ ఆహారాన్ని పెట్టకూడదు. పిల్లలు రాత్రి సమయంలో బాగా నిద్రపోవాలి అనుకుంటే, మీ పిల్లలు నిద్రపోయే ముందు "కెఫిన్" ను కలిగివున్న ఆహార పదార్థాలను తినకుండా నిరోధించడం అనేది ఉత్తమమైన చిట్కాలలో ఒకటి.

రాత్రివేళల్లో మీ పిల్లలను నిద్రావస్థ చేయడానికి ఉన్న ముఖ్యమైన మార్గాల్లో ఇది ఒకటి. ఎప్పుడూ ఒకే సమయంలో నిద్రించడం వల్ల, పిల్లల్లో ఒక స్థిరమైన సమయానికి నిద్రపోయే అలవాటును అభివృద్ధి చెందేందుకు సహాయపడుతుంది. ఈ అలవాటు మీ పిల్లలు ఎదుగుదలలో ఉన్నప్పటికీ కూడా గొప్పగా నిద్రించడానికి సహాయపడుతుంది.మంచం ఎక్కే ముందు - అసాధారణమైన పనులను చేసే అలవాటును మీ పిల్లల్లో పెంపొందించవద్దు. దానికి బదులుగా, పిల్లల మనసుకు శాంతిని చేకూర్చేలా ఉండే, శాంతియుతమైన వాతావరణంలో నిద్రపోయేలా చుడండి . ప్రారంభ దశల్లో, మీ పిల్లలకు నిద్రపట్టడానికి మీరు లాలిపాటలను పాడే ఉంటారు.

మీ పిల్లలు శారీరకంగా మరియు మానసికంగానూ చాలా సున్నితమైన వారిగా ఉంటారు. కాబట్టి, మీరు పిల్లల శరీరానికి సౌకర్యవంతమైన ఒక మంచమును ఏర్పాటు చెయ్యవలసిన అవసరం ఎంతైనా వుంది. సంప్రదాయబద్ధంగా మీ పిల్లలు నిద్రించేందుకు అవసరమయ్యే "టెడ్డిబేర్" వంటి బొమ్మలను అనుమతించాలి. ఇది మంచి నిద్రావస్థను పొందటానికి మరియు మీ తోడు లేకపోయినా ఒంటరిగా పడుకోవడానికి సహాయపడుతుంది.దాదాపు పిల్లలందరూ నిద్రలో తమ తల్లిదండ్రులని కూడా చూసే అలవాటును కలిగివుంటారు. పిల్లలు నిద్రిస్తున్నప్పుడు వారికి మీరు చాలా దగ్గరగా ఉండాలి దేనికోసమంటే, రాత్రి సమయంలో వారికి ఎదురయ్యే అవసరాలను తీర్చడం కోసం, అలాగే పీడ కలలు వచ్చి భయపడే అవకాశం ఉంది కాబట్టి పిల్లలకు దగ్గరలో పడుకోండి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: