సెప్టెంబ‌ర్ 15వ తేదీకి చ‌రిత్ర‌లో ఎంతో ప్రాధాన్యం.. విశేషాలేంటో తెలుసా..?

Spyder
గడిచిన కాలములో మానవుని చర్యల యొక్క అధ్యయనమే చరిత్ర. ఎన్నో విశేష‌ణ‌ల స‌మ‌హార‌మే చ‌రిత్ర‌. నాటి ఘ‌ట‌న‌లను..మాన‌వుడు న‌డిచి వ‌చ్చిన బాట‌ల‌ను స్మ‌రించుకోవ‌డానికే చ‌రిత్రే. ప్ర‌పంచ మాన‌వాళి ప‌రిణామ క్ర‌మంలో సెప్టెంబ‌ర్ 15వ ‌తేదీకి ఎంతో ప్రాధాన్యం ఉంది.  హెరాల్డ్ అందిస్తున్న ఆ విశేషాలు మీకోసం
ముఖ్య సంఘటనలు

1931: భక్త ప్రహ్లాద [తొలి తెలుగు టాకీ (మాటలు వచ్చిన సినిమా)] విడుదల. ఇందులో 40 పాటలున్నాయి. పద్యాలు ఉన్నాయి. బొమ్మ సరిగా కనిపించక పోయినా, మాటలు కొన్నిచోట్ల సరిగా వినిపించక పోయినా, ప్రేక్షకులు విరగబడి చూశారు.
2000: 27వ వేసవి ఒలింపిక్ క్రీడలు సిడ్నీలో ప్రారంభమయ్యాయి.
2006: 14వ అలీన దేశాల సదస్సు క్యూబా రాజధాని నగరం హవానా లో ప్రారంభమైనది.
2009: తిరుపతి లడ్డుకు భౌగోళిక అనుకరణ హక్కు లభించింది.
ప్ర‌ముఖుల జననాలు

1856: నారదగిరి లక్ష్మణదాసు, పాలమూరు జిల్లాకు చెందిన కవి, వాగ్గేయకారుడు. (మ.1923)
1861: మోక్షగుండం విశ్వేశ్వరయ్య, భారతదేశపు ఇంజనీరు. (మ.1962)
1890: పులిపాటి వెంకటేశ్వర్లు, తెలుగు రంగస్థల నటుడు, తొలితరం చలనచిత్ర నటుడు (మ.1972)
1900: కేదారిశ్వర్ బెనర్జీ, భౌతిక శాస్త్రవేత్త. ఎక్స్ రే క్రిస్టలోగ్రఫీలో నిపుణుడు. (మ.1975)
1909: రోణంకి అప్పలస్వామి, సాహితీకారుడు. (మ.1987)
1923: నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యులు, సంస్కృతాంధ్ర పండితులు, రేడియో కళాకారులు.
1925: శివరాజు సుబ్బలక్ష్మి, రచయిత్రి, చిత్రకారిణి.
1926: అశోక్ సింఘాల్, విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడు (మ. 2015).
1927: నల్లాన్ చక్రవర్తి శేషాచార్లు, తెలుగు రచయిత.
1942: సాక్షి రంగారావు, రంగస్థల, సినిమా నటుడు. (మ.2005)
1961: పాట్రిక్ ప్యాటర్సన్, వెస్టీండీస్ మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1967: రమ్యకృష్ణ, నటి.

మరణాలు
1963: పొణకా కనకమ్మ, గొప్ప సంఘ సంస్కర్త, నెల్లూరిలో కస్తూర్బా గాంధీ పాఠశాలను స్థాపించింది. సాహిత్య రంగములో కూడా ఎంతో కృషి చేసింది. (జ.1892)
1998: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
2015: వై.బాలశౌరిరెడ్డి, హిందీభాషాప్రవీణుడు, హిందీ చందమామ సంపాదకుడు. (జ.1928)

పండుగలు , జాతీయ దినాలు
జాతీయ ఇంజనీర్ల దినోత్సవము
అంతర్జాతీయ ప్రజాస్వామ్య దినోత్సవం
ప్రపంచ చర్మ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
సంఛాయక దినోత్సవం

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: